Begin typing your search above and press return to search.

టీడీపీ ఓవ‌రాక్ష‌న్ తోనే ఈ ప‌రిస్థితి.. ఎమ్మెల్సీల బాధ‌!

By:  Tupaki Desk   |   24 Jan 2020 6:10 AM GMT
టీడీపీ ఓవ‌రాక్ష‌న్ తోనే ఈ ప‌రిస్థితి.. ఎమ్మెల్సీల బాధ‌!
X
మండ‌లి ర‌ద్దు కాబోతోంద‌నే ఊహాగానాల నేప‌థ్యంలో ఎమ్మెల్సీలు చాలా బాధ‌ప‌డిపోతూ ఉన్నట్టున్నారు. మామూలుగానే ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌కు ఎంతో పోటీ ఉంటుంది. పార్టీ త‌ర‌ఫున ఆ ప‌ద‌వుల కోసం చాలా మంది పోటీలు ప‌డుతూ ఉంటారు. ఆ హామీల‌తోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చేవారు. పార్టీలు మారేవారు బోలెడంత మంది. అనేక మంది రాజ‌కీయ నిరుద్యోగుల‌కు మండ‌లి ఒక రాజ‌కీయ ఉపాధిగా ఉంది కూడా. ఇలాంటి నేప‌థ్యంలో ఏపీలో మండ‌లి ర‌ద్దు కాబోతోంద‌నే ఊహాగానాలతో ఎమ్మెల్సీలు చాలా బాధ‌ప‌డుతూ ఉన్నారు.

ఇదంతా తెలుగుదేశం పార్టీ ఓవ‌రాక్ష‌న్ తోనే అంటూ ఎమ్మెల్సీల్లో ఒక‌ర‌క‌మైన బాధ క‌నిపిస్తూ ఉంది. మండ‌లి అనేది కేవ‌లం స‌ల‌హాలు - సూచ‌న‌లు ఇవ్వ‌డానికే అని.. అంత‌టితో త‌మ పాత్ర ప‌రిమితం అని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు సూటిగా స్ప‌ష్టం చేస్తూ ఉన్నారు. అయితే తెలుగుదేశం వాళ్లు ఓవ‌రాక్ష‌న్ చేశార‌ని - మండ‌లిని అడ్డం పెట్టుకుని రాజ‌కీయం చేశార‌ని.. వారు వాపోతున్నార‌ట‌. ఇప్పుడు ప్ర‌భుత్వానికి మండి.. ఏకంగా మండ‌లే ర‌ద్దు అయ్యేలా ఉంద‌ని వారు తెలుగుదేశం పార్టీపై మండిప‌డుతున్నార‌ని భోగ‌ట్టా.

అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీల్లో కూడా కొంత‌మందికి ఈ బాధ ఉంద‌ట‌. పార్టీ అధికారంలో లేక‌పోయినా.. త‌మ బోటి వాళ్లం కొంత‌మంది మండ‌లి స‌భ్యులుగా ఉంటూ వ‌చ్చామ‌ని.. ఇప్పుడు ఆ హోదా కూడా లేకుండా పోతోంద‌ని వారు వాపోతున్నార‌ట‌. మండ‌లిలో వికేంద్రీక‌ర‌ణ బిల్లును అడ్డుకుని కూడా తాము సాధించింది ఏమీ లేద‌ని - ఇప్ప‌టికిప్పుడు మండ‌లి ర‌ద్దు అయితే.. సెలెక్ట్ క‌మిటీ ఊసు లేక‌పోవ‌చ్చ‌ని, ఆ బిల్లు త్వ‌ర‌లోనే ఆమోదం పొందుతుంద‌ని వారు అంటున్నార‌ట‌. ఒక‌వేళ మండ‌లి ఉన్నా మూడు నెల‌ల్లో ఆ బిల్లు ఆమోదం పొంద‌వ‌చ్చు. కాబ‌ట్టి.. మండ‌లిలో అడ్డుపుల్ల వేయ‌డం అనేది అర్థం లేని చ‌ర్య అని వారు వాపోతున్నార‌ట‌.

ఇదంతా య‌న‌మ‌ల రాజ‌కీయం వ‌ల్ల వ‌చ్చిన చేటు అని - య‌న‌మ‌ల‌-లోకేష్ లు ఓవ‌రాక్ష‌న్ చేసి.. చంద్ర‌బాబు నాయుడు రంగంలోకి దిగి మండ‌లి చైర్మ‌న్ ను త‌మ క‌నుస‌న్న‌ల్లో న‌డిపించార‌ని..దీంతో ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ఎమ్మెల్సీలు చంద్ర‌బాబు మీద - టీడీపీ మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్న‌ట్టుగా తెలుస్తోంది.