Begin typing your search above and press return to search.
శత్రువు.. శత్రువు కలిస్తే గగ్గోలు
By: Tupaki Desk | 6 Oct 2019 6:32 AM GMTశత్రువు.. శత్రువు కలిస్తే టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. మోడీతో సాన్నిహిత్యానికి పచ్చమీడియా, ఆ మీడియా వెనుకుండి నడిపించే చంద్రబాబు ఉబలాటపడుతున్న వేళ.. తెలుగు రాష్ట్రాల సీఎం వెళ్లి ఢిల్లీలో మోడీషాలను కలవడాన్ని వారు జీర్ణించుకోవడం లేదట..అందుకే తాజాగా వారి మధ్య పుల్లలు పెట్టే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రతీ ఆదివారం వ్యాసం రాసే టీడీపీ పత్రికాధినేత తాజాగా మరోసారి తన ప'పలుకు'లో ఇదే విషయాన్ని నొక్కి వక్కానించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఓ పెద్ద నాయకుడు అమిత్ షా దగ్గరకు వెళ్లి 'కేసీఆర్ తో చెలిమి వద్దని చెప్పాడని.. దానికి అమిత్ షా.. కేసీఆర్ మనకు శత్రువే.. ఆయన నమ్మదగ్గ వ్యక్తి కాదంటూ' వ్యాఖ్యానించారంటూ చెప్పుకొచ్చాడు..
టీడీపీకి ఎంతో దగ్గరైన ఈ పత్రికాధినేత మాటలు టీడీపీ వాయిస్ గానే మనకు వినిపిస్తాయి. దీన్ని బట్టి కేసీఆర్, జగన్ లు బీజేపీతో చెలిమి పెట్టుకుంటే టీడీపీకి, దాన్ని నమ్ముకొని ఉన్న పచ్చమీడియాకు పెద్ద నష్టం. అందుకే వారిద్దరూ కలవకూడదని భావించాయి. ఇప్పుడు కలిశాక వారి మధ్య పొరపొచ్చాలు, గొడవలు సృష్టించే ఎత్తుగడలు వేస్తున్నాయి..
రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు ఇక్కడ ప్రజల బాగు కోసం అభివృద్ధి కోసం మోడీని కలిశారు. అవసరం అయితే భవిష్యత్ లోనూ బీజేపీకి మద్దతుగా నిలబడుతారు..అయితే బీజేపీతో కేసీఆర్, జగన్ లు కలిస్తే రాజకీయంగా ఏపీలో, తెలంగాణలో టీడీపీ ఉనికే ఉండదన్న వాస్తవం పచ్చమీడియాకు, చంద్రబాబుకు తెలుసు. అందుకే బీజేపీకి కేసీఆర్ నమ్మదగ్గ వ్యక్తి కాదంటూ గాలివార్తలు సృష్టించే ప్రయత్నాలు సాగుతున్నాయని టీఆర్ఎస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. దీన్ని మోడీషాలతో కేసీఆర్, జగన్ ల స్నేహాన్ని టీడీపీ జీర్ణించుకోవడం లేదని అర్థమవుతోందంటున్నారు.