Begin typing your search above and press return to search.

టీడీపీ పొత్తు.. ప‌వ‌న్ యూట‌ర్న్ వెనుక‌.. ఏం జ‌రిగింది..?

By:  Tupaki Desk   |   11 May 2022 2:29 AM GMT
టీడీపీ పొత్తు.. ప‌వ‌న్ యూట‌ర్న్ వెనుక‌.. ఏం జ‌రిగింది..?
X
ఇది చాలా చాలా ఆస‌క్తిక‌ర విష‌యం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తులు పెట్టుకునేందుకు టీడీపీ, జ‌న‌సేన పార్టీలు రెడీ అయ్యాయ‌నేది ఒక ఆస‌క్తిక‌ర విష‌యం అయితే..దీనిక‌న్నా.. ఇంపార్టెంట్‌.. ఇంట్ర‌స్టింగ్ టాపిక్‌.. అసల ఈ రెండు పార్టీల మ‌ధ్య పొత్తుకు రాజ‌కీయంగా ఎలా.. సంధికుదిరింది? అనేది ప్ర‌శ్న‌. ఇదే ఇప్పుడు మేధావులు సైతం దృష్టి పెట్టిన విష‌యం. ఎందుకంటే.. 2014 ఎన్నిక‌ల్లో క‌లిసి రంగంలోకి దిగిన‌.. ఈ రెండు పార్ట‌ల మ‌ధ్య మ‌ధ్య‌లోనే కొన్ని అభిప్రాయ బేదాలు వ‌చ్చాయి.

ప్ర‌త్యేక హోదాకు బ‌దులుగా.. చంద్ర‌బాబు సీఎంగా ఉండి.. కేంద్రం వ‌ద్ద రాజీప‌డి.. ప్ర‌త్యేక ప్యాకేజీ తీసు కువ‌చ్చార‌ని.. కాకినాడ స‌భ‌లో ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ప్యాకేజీని ఆయ‌న పాచిపోయిన ల‌డ్డూ తో పోల్చారు. దీంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య అప్ప‌ట్లోనే మాట‌ల తూటాలు పేలాయి. త‌ర్వాత‌.. ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి శ్రీకాకుళంలో కిడ్నీ బాధిత రోగుల క‌ష్టాలను ప‌వ‌న్‌తెర‌మీద‌కిఇ తీసుకువ‌చ్చి.. చంద్ర‌బాబు స‌ర్కారును ఇరుకున ప‌డేశారు. అదేస‌మ‌యంలో ఎన్నిక‌ల్లో.. సీఎం కొడుకే సీఎం కావాలా.. అంటూ.. ఆయ‌న ప‌రోక్షంగా లోకేష్‌పై విమ‌ర్శ‌లు చేశారు.

ఇలా.. అనేక సంద‌ర్భాల్లో.. ఈ రెండు పార్టీల మ‌ధ్య వివాదాలు విభేదాలు చోటు చేసుకున్నాయి. ఇంత‌లో నే.. ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డం.. ఆవెంట‌నే.. ప‌వ‌న్ నేరుగా ఢిల్లీకి వెళ్లి.. బీజేపీతో పొత్తు పెట్టుకోవ‌డం.. జ‌రిగిపో యాయి. దీంతో బీజేపీలో ఆశ‌లు పెరిగాయి. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీడీపీ బ‌ల‌హీన‌ప‌డితే.. దీని ప్లేస్‌ను తాము రీప్లేస్ చేయొచ్చ‌ని.. ఈ పార్టీ నేత‌లు ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనేప‌వన్ఃతో పొత్తుకు రెడీ అయ్యారు. ఇప్పటికీ.. ఇదే ఆశ‌లతో ఉన్నారు. అందుకే.. తాజాగా కూడా తాము ప‌వ‌న్‌తోనే పొత్తులో ఉన్నామ‌ని చెబుతున్నారు.

అయితే. ఇప్పుడు టీడీపీ అనూహ్యంగా జ‌న‌సేన‌వైపు చూడ‌డం.. జ‌నసేన కూడా టీడీపీతో పొత్తు కు రెడీ కావ‌డం.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. మ‌రి కేవ‌లం మూడేళ్ల‌లోనే.. రెండు పార్టీల మ‌ధ్య పొత్తు చిగురించ‌డానికి తెర‌వెనుక ఏం జ‌రిగింద‌నేది ఆస‌క్తిగా మారింది. దీనికి చంద్ర‌బాబు కీల‌కంగా ఉన్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 2019 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. రాష్ట్రంలో స్థానిక‌, పంచాయ‌తీ, కార్పొరేష‌న్ ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఆ ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ చేసిన జ‌న‌సేన‌, టీడీపీల‌ను.. వైసీపీ గ‌ట్టిగా నిలువ‌రించింది.

చాలా చోట్ల అస‌లు అభ్య‌ర్థుల‌ను కూడా నామినేష‌న్ వేయ‌కుండా అడ్డుకున్నారు. కొన్ని చోట్ల అభ్య‌ర్థుల అప‌హ‌ర‌ణ‌లు కూడా జ‌రిగాయి. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ వైసీపీ గెలిస్తే.. పార్టీల ఉనికికే ప్ర‌మాదం ఉంద‌ని.. చంద్ర‌బాబు జ‌న‌సేన‌కు నూరిపోశార‌ని.. అందుకే ఆ య‌న యూట‌ర్న్ తీసుకున్నార‌ని.. రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. మ‌రోసారి ప‌వ‌న్ గెలిస్తే.. ఖ‌చ్చితంగా బెంగాల్ మాదిరిగా ప‌రిస్థితి మార‌తుంద‌ని కూడా భావిస్తున్నార‌ని.. అందుకే.. ప‌వ‌న్‌ను పొత్తుల‌కు ఒప్పించార‌ని అంటున్నారు.