Begin typing your search above and press return to search.

టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ పొత్తు లెక్క‌లు ఇవేనా?

By:  Tupaki Desk   |   15 Oct 2021 2:30 AM GMT
టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ పొత్తు లెక్క‌లు ఇవేనా?
X
ఏపీలో పొలిటిక‌ల్ లెక్క‌లు మారుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఎదురైన ప‌రాభ‌వం త‌ర్వాత‌.. వ్యూహాత్మ‌క రాజ‌కీ య వ్య‌వ‌హారాలు మారుతున్నాయి. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌ను ఒంట‌రిగా ఎదుర్కొన‌డం.. అనేది మిగిలిన ప‌క్షాల‌కు సాధ్యం కాద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. దీంతో రాజ‌కీయంగా మ‌ళ్లీ పాత పొత్తులు తెర‌మీదికి వ‌స్తున్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా మూడు పార్టీలు.. ఈ దిశ‌గా అడుగులు వేస్తున్నాయని అంటున్నారు ప‌రిశీల‌కులు. 2014 ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. కొత్త‌గా ఏర్ప‌డిన న‌వ్యాంధ్ర‌లో వ్యూహాత్మ‌కంగా.. టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ క‌లిసి కూట‌మిగా ఎన్నిక‌ల‌కు వెళ్లాయి.

ప్ర‌త్య‌క్షంగా ఈ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేయ‌క‌పోయినా.. ప‌వ‌న్ ప్ర‌చారం చేశారు. దీంతో బీజేపీ-టీడీపీ కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది. బీజేపీకి ఏకంగా ఒక ఎంపీ స్తానం(విశాఖ‌ప‌ట్నం), నాలుగు ఎమ్మెల్యే స్థానాలు ల‌భించాయి. ఇక‌, టీడీపీ అధికారంలోకి వ‌చ్చింది. మంత్రి ప‌ద‌వులు పంచుకున్నారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల‌కు(2019) వ‌చ్చే స‌రికి మూడు పార్టీలూ.. ఎవ‌రి దారిలో అవి ప‌య‌నించాయి. ఈ ప‌రిణామం వెనుక ఒక లాజిక్ ఉంద‌నేది అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపైఏదైనా వ్య‌తిరేక‌త ఉంటే.. అది బీజేపీకి, జ‌న‌సేన‌కు పడుతుంద‌ని.. త‌ద్వారా.. వైసీపీకి ప‌డ‌కుండా.. జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌చ్చ ని.. ఈ మూడు పార్టీలూ భావించి ఉంటాయ‌నే ప్ర‌చారం జ‌రిగింది.

అయితే.. ఈ ప్ర‌య‌త్నం విక‌టించింది. మొత్తంగా చూస్తే.. వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. త‌ర్వాత ఈ గెలుపు, ఓట‌మి లెక్క‌లు చూసుకుంటే.. జ‌న‌సేన‌కు సీట్లు రాక‌పోయినా.. ఓట్ల శాతం బాగానే క‌నిపించింది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌.. రెండు స్థానాల్లో పోటీ చేసినా.. ఓడిపోయారు. టీడీపీకి 23 స్థానాలు వ‌చ్చాయి. గెలుపు గుర్రాలు అనుకున్న నాయ‌కులు ఓట‌మి పాల‌య్యారు. ఇక‌, ఓట్ల ప‌రంగా చూసుకుంటే.. గుంటూరు నుంచి శ్రీకాకుళం వ‌ర‌కు.. 44 సీట్ల‌లో జ‌న‌సేన 20-35 శాతం ఓట్లు చీల్చింద‌నే అంచ‌నాలు వ‌చ్చాయి. ఇవ‌న్నీ.. టీడీపీ ఓట్లేన‌ని.. పార్టీ నాయ‌కులు లెక్క‌లు క‌ట్టారు.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీడీపీ-జ‌న‌సేన-బీజేపీలు పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగితే బాగుం టుంద‌నే అభిప్రాయం పార్టీ కేడ‌ర్ నుంచి వ్య‌క్త‌మవుతోంది. వాస్త‌వానికి ఇప్ప‌టికే బీజేపీ-జ‌న‌సేన పొత్తులో ఉన్నాయి. మ‌రోవైపు.. టీడీపీ కూడా.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి.. భారీ ఎత్తున ప్లాన్ చేసుకుంటు న్నారు. 2019లో జ‌రిగిన ఒంట‌రి పోరు ప్ర‌ధానంగా కొంప ముంచింద‌నే అభిప్రాయం.. ఇప్ప‌టికీ పార్టీలో వినిపిస్తూనే ఉంది. ఈ క్ర‌మంలో గ‌త త‌ప్పును పున‌రావృతం కాకుండా చూసుకునేందుకు పార్టీ వ్యూహా త్మ‌కంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా జ‌న‌సేన‌, బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు అంత‌ర్గ‌తంగా వ‌స్తున్న సూచ‌న‌ల‌ను పార్టీ అధినేత చంద్ర‌బాబు.. ప‌రిశీలిస్తున్నారు.

మ‌రోవైపు... జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా.. ఇటీవ‌ల కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కోసం.. ప్ర‌జ‌ల సంక్షేమం కోసం.. ఎవ‌రితో అయినా.. క‌లుస్తామంటూ.. ప్ర‌క‌టించారు. అంటే.. దీని వెనుక టీడీపీ అధినేత వైపు.. ప‌వ‌న్ చూస్తున్నార‌నే కొన్నాళ్ల ప్ర‌చారానికి బ‌లం చేకూరిన‌ట్టు అయింది. ప‌వ‌న్ అయినా.. చంద్ర‌బాబు అయినా.. బీజేపీ అయినా.. క‌లిసి ముందుకు సాగితే.. ఫ‌లితం ఉంటుంద‌ని.. పార్టీలో సీనియ‌ర్లు కూడా అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇటీవ‌ల టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు బుచ్చ‌య్య చౌద‌రి.. ఇదే వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్‌తో క‌లిసే అవ‌కాశం ఉందా? అని ప్ర‌శ్నిస్తే.. మున్ముందు ప‌రిణామాల‌ను బ‌ట్టి క‌లిస్తే.. త‌ప్పులేద‌న్నారు.

సో.. ఈ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఈ మూడు పార్టీలూ క‌లిసే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. ఇక్క‌డ పెద్ద మెలిక ఉంది. బీజేపీ.. అధిష్టానం.. టీడీపీలో క‌లిసేందుకు సిద్ధంగా ఉందా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. గ‌తంలో మోడీని చంద్ర‌బాబు అవ‌మానించార‌ని.. మోడీని అధికారం నుంచి దింపేస్తామ‌ని ప్ర‌క‌టించి.. మ‌మ‌తా బెన‌ర్జీతో క‌లిసి ముందుకు న‌డిచార‌ని.. సో.. ఈ ప‌రిణామాల‌తో బీజేపీ-టీడీపీతో క‌లిసి ప‌నిచేస్తుందా? అనేది ప్ర‌శ్న‌. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.

ఒక‌వేళ‌.. ఏపీలో పుంజుకోవ‌డ‌మే ధ్యేయంగా.. అన్ని విష‌యాల‌ను రాజ‌కీయ కోణంలో క‌నుక చూస్తే.. పొత్తుకు వెళ్లే అవ‌కాశం ఉంది. ఇదే జ‌రిగితే.. జ‌న‌సేన‌కు 25 నుంచి 30 స్థానాలు.. బీజేపీకి 7 నుంచి 9 స్థానాలు కేటాయించి.. మిగిలిన స్థానాల్లో టీడీపీ పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే విష‌యాన్ని పార్టీ సీనియ‌ర్లు కూడా లెక్క‌లు వేసుకుంటున్నారు., మ‌రి ఈ వ్యూహం ఫ‌లిస్తుందా? వైసీపీని అధికారం నుంచి దింపేస్తారా? చూడాలి.. ఏం జ‌రుగుతుందో!!

ఈ ఆర్టిక‌ల్‌పై మీ ఆలోచ‌న‌లు.. స‌ల‌హాలు.. కామెంట్ల రూపంలో పంపండి.. మీకు ఈ ఆర్టిక‌ల్ న‌చ్చితే.. లైక్ చేయండి.. షేర్ చేయండి.