Begin typing your search above and press return to search.

టీడీపీ..జ‌న‌సేన‌..క‌మ్యూనిస్టులు..ఒక‌రికి ఒక‌రు!

By:  Tupaki Desk   |   13 Jan 2020 5:47 AM GMT
టీడీపీ..జ‌న‌సేన‌..క‌మ్యూనిస్టులు..ఒక‌రికి ఒక‌రు!
X
తెలుగుదేశం పార్టీ, జ‌న‌సేన‌, క‌మ్యూనిస్టు పార్టీలు.. వీళ్లంతా ఇప్పుడు ఒక‌రి కోసం ఒక‌రు అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తూ ఉన్నారు. ఏపీలో ఈ ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య‌న బీభ‌త్స‌మైన ఐక్య‌త క‌నిపిస్తూ ఉంది. విశేషం ఏమిటంటే.. ఈ ఐక్య‌త‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీలోని కొంత‌మంది కూడా త‌మ‌వంతు సాయం అందిస్తూ ఉండ‌టం.

ప‌వ‌న్ క‌ల్యాణ్ అనుమ‌తి లేకుండా అమ‌రావ‌తి లో ర్యాలీ నిర్వ‌హించాల‌ని చూస్తే పోలీసులు అడ్డుకున్నారు. సీఎం వ‌చ్చే దారిన కాకుండా మ‌రో దారిన వెళ్లాల‌ని సూచిస్తే ఆయ‌న రోడ్డుపై ప‌డుకున్నారు. దీంతో చంద్ర‌బాబు నాయుడు స్పందించేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను అడ్డుకుంటారా.. అంటూ ఆయ‌న విరుచుకుప‌డ్డారు.

ఇక చంద్ర‌బాబు నాయుడు కూడా అమ‌రావ‌తి ప్రాంతంలో అనుమ‌తి లేకుండానే ర‌చ్చ చేయ‌బోతే పోలీసులు అడ్డుకున్నారు. ఆయ‌న‌ను పోలీసులు వ్యాన్ ఎక్కించి మ‌రో చోట‌కు త‌ర‌లించారు. దీంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. చంద్ర‌బాబును పోలీసులు అరెస్టు చేయ‌లేదు. ఇంటికి మాత్ర‌మే త‌ర‌లించారు. అయినా ప‌వ‌న్ తెగ ఫీల్ అయిపోయారు. చంద్ర‌బాబు నే అరెస్టు చేస్తారా.. అంటూ ఆయ‌న‌పై త‌న భ‌య‌భ‌క్తుల‌ను చాటుకున్నాడు ప‌వ‌న్ క‌ల్యాణ్.

ఇక క‌మ్యూనిస్టులు త‌మ కామెడీ డైలాగుల‌తో ఈ వ్య‌వ‌హారంలో త‌ల‌దూర్చి వార్త‌ల్లో నిలుస్తూ ఉన్నారు. అగ్గి రాజేస్తాం.. అంటూ మాట్లాడుతున్నారు. అయితే క‌మ్యూనిస్టుల‌కు ఇప్పుడు అంత సీన్ లేదు. అగ్గి రాజేసే శ‌క్తిని వారు ఎప్పుడో కోల్పోయారు. అమ‌రావ‌తి కి మ‌ద్ద‌తు ద్వారా ఎర్ర‌న్న‌లు త‌మ శ‌క్తిని పూర్తిగా కోల్పోయారు. ఒక క్యాపిట‌లిస్టు విధానానికి తాము మ‌ద్ద‌తు ప‌లుకుతూ..క‌మ్యూనిస్టులు ఇంకా ప్ర‌హ‌స‌నం పాల‌వుతూ ఉన్నారు. ఇక బీజేపీలోని కొంత‌మంది కూడా త‌మ‌వంతుగా ఈ పార్టీల‌కు మాట సాయం చేస్తూ ఉన్నారు.

గ‌త ఐదేళ్ల‌లో ప్ర‌తిప‌క్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా దానికి మిగ‌తా ప్ర‌తిప‌క్షాలు మ‌ద్ద‌తును ఇచ్చేవి కావు. ఇప్పుడు మాత్రం తెలుగుదేశం ఆధ్వ‌ర్యంలో ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య‌న విప‌రీత‌మైన ఐక్య‌తే క‌నిపిస్తూ ఉన్నాయి. అయితే అన్ని పార్టీలూ క‌లిసి అమ‌రావ‌తి అంటూ..మిగ‌తా ప్రాంతాల్లో బేస్ మెంట్ ను కోల్పోతున్న‌ట్టుగా ఉన్నాయని ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ప‌డుతూ ఉన్నారు.