Begin typing your search above and press return to search.
అంతొద్దు... అది చాలు : టీడీపీ అక్కడికే తెగ్గొడుతుందా...?
By: Tupaki Desk | 25 Jun 2022 2:30 AM GMTతెలుగుదేశం పార్టీ వయసు నలభై ఏళ్ళు. దాని పగ్గాలు పట్టి నడిపిస్తున్న అధినాయకుడి రాజకీయం నాలుగున్నర దశాబ్దాలు పై దాటిపోయింది. ఆయన చాణక్య రాజకీయం ముందు ఎవరూ నెగ్గలేరు. ఇక ఏపీలో పొత్తుల పితలాటకానికి తెర ఎవరు తీశారు ఎవరు వంత పాడారు అన్నది ఇపుడు అప్రస్తుతం కానీ మొత్తానికి చంద్రబాబు ఆడిన మైండ్ గేమ్ లో పడి జనసేన ఇపుడు కొట్టుమిట్టాడుతోందా అంటే రాజకీయ పరిణామాలు చూస్తే అవును అనే అనిపిస్తున్నాయి.
నిజానికి కుప్పంలో బాబు వన్ సైడ్ లవ్ అన్నప్పటికి జనసేన చాలా హైప్ క్రియేట్ చేసే స్థితిలో ఉంది. అందుకే వాళ్ళు కూడా మన వైపు చూడాలిగా అని బాబు తమ్ముళ్ళకు చెప్పారు. ఇదే గ్రీన్ సిగ్నల్ అనుకుని పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభలో తెగించి పల్లవి పాడేశారు. వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలుస్తాను అంటూ గట్టి శపధమే చేసేశారు. సీన్ కట్ చేస్తే చరణాన్ని గోదావరి జిల్లాలలో చంద్రబాబు పాడారు.
ఇలా సాగుతున్న పొత్తుల పాటకు సడెన్ గా బ్రేక్ పడింది బాదుడే బాదుడు ప్రోగ్రాం. ఆ మీదట జరిగిన మహానాడు మీటింగ్ కూడా. ఇసుక వేస్తే రాలనంతగా ఒంగోలులో జరిగిన ఈ మీటింగులో పొత్తు ఊసేత్తకుండా టీడీపీ కధ ముగించేసింది. ఇక దాని మీద మరో మాట అంటూ పవన్ కళ్యాణ్ మూడు ఆప్షన్లు ముందు పెట్టి తగ్గారో పెరిగారో తెలియదు కానీ సైలెంట్ గా అధినాయకత్వం దాన్ని తోసిపుచ్చి పవన్ లో ఆవేశాన్ని పెంచేసింది. ఇక రిటార్ట్ అన్నట్లుగా పర్చూరు లో జరిగిన మీటింగులో జనంతోనే మా పొత్తు అని పవన్ అనేశారు.
ఇపుడు చూస్తే పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేయాలనుకున్నా టైమ్ సరిపోతుందా అన్నది ఒక చర్చ. ఇక ఆయన బస్సు యాత్ర హిట్ అయినా కూడా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోకపోవడం వైసీపీ టీడీపీ బలంగా ఉండడంతో ఈ పోరులో ఎంతమేరకు నెగ్గుతారు అన్న డౌట్లు ఉండనే ఉన్నాయి. ఇలా పొత్తుల విషయాన్ని వన్ సైడ్ లవ్ తో తామే ఎత్తి ఇపుడు పవన్ని తమ చాణక్య రాజకీయంతో ఇబ్బంది పెడుతోంది టీడీపీ అని అంటున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ ఎంత చెప్పుకున్నా ఆయన టీడీపీతో పొత్తులోనే ఉంటారు అని అంతా భావిస్తారు. ఎందుకంటే అలాంటి బ్రాండింగ్ ని ఇచ్చి పడేశాయి టీడీపీ అనుకూల మీడియా, వైసీపీ అనుకూల మీడియా. దాంతో పవన్ సొంత పోటీ చేసి శీల పరీక్ష చేసుకున్నా భారీ రిస్క్ తప్ప ఒరిగేది పెద్దగా ఉండదని అంటున్నారు. అదే టైమ్ లో గౌరవప్రదమైన ఒప్పందంతో టీడీపీతో పొత్తులకు చూస్తున్నా అక్కడ మాత్రం ఒకే ఒక నంబర్ కి ఫిక్స్ అయి కూర్చున్నారు అని ప్రచారం సాగుతోంది.
అదేంటి అంటే జిల్లాకు ఒక సీటు వంతున ఇరవై ఆరు జిల్లాలకు ఇరవై ఆరు సీట్లు. ఇంతకు మించి ఒక్క సీటు కూడా ఎగస్ట్రా ఇవ్వలేమని టీడీపీ నేతలు అంటున్నారుట. పైగా తమ బలం పెరిగింది కాబట్టి తాము గెలిచి తీరుతామని కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇంకో చిత్రమైన వాదన కూడా ముందుకు తెస్తున్నారు. ఎక్కువ సీట్లు జనసేనకు ఇస్తే ఆ పార్టీ గెలవకపోతే అవి అకారణంగా వైసీపీ ఖాతాలోకి వెళ్ళి మ్యాజికి ఫిగర్ కి దూరంగా తాముండాల్సి వస్తుందని.
మొత్తానికి ఎన్నో లెక్కలు అంచనాలు వేసిన మీదటనే జనసేనకు జనాలు మాత్రమే వస్తారు అని ఓట్లేసేవారు ఎంతమంది అన్న దాని మీదనే ఇపుడు చర్చలు జరుగుతూ పాతిక మీద ఒక్కటే అన్న మాటకైతే టీడీపీ కట్టుబడి ఉందని తెలుస్తోంది. ఇక ఆ సీట్లను కూడా జనసేన తానుగా పొత్తు ప్రదిపాదనలు తెస్తేనే అంటున్నారు. అంటే టీడీపీ నుంచి అలాంటి ప్రయత్నాలు ఏవీ ఇక మీదట ఉండవన్న మాట.
ఇపుడు బాబు జిల్లా టూర్లకు జనాలు బాగా వస్తున్నారు. రేపు లోకేష్ పాదయాత్ర కూడా చేసేందుకు రెడీ అంటున్నారు. అది కూడా కచ్చితంగా సక్సెస్ చేయడానికి టీడీపీ అన్నీ రెడీ చేసుకుంది. దాంతో తమకేమి కావాలన్న ధీమాతోనే టీడీపీ ఉందని అంటున్నారు. మరి ఈ మొత్తం ఎపిసోడ్ లో జనసేన సరైన రాజకీయ వ్యూహాలు లేకుండా తొందరపడి ముందే కూసిన కోయిన మాదిరిగా పొత్తుల గురించి మాట్లాడిందని అంటున్నారు.