Begin typing your search above and press return to search.
రెండు శపథాలు.. రెండు పార్టీలు.. వైసీపీకి చుక్కలు చూపేనా..?
By: Tupaki Desk | 21 Oct 2022 12:30 PM GMTరాజకీయాల్లో సవాళ్లు చేయొచ్చు. ప్రతిసవాళ్లు కూడా చేయొచ్చు. కానీ, శపథాలు చేయడం మాత్రం ఇబ్బందే. ఒకసారి శపథం చేస్తే..దానిని నెరవేర్చు కుని తీరాలి. లేకపోతే.. తాను మరిచిపోయినా.. తన ప్రత్యర్థులు మాత్రం గుర్తు పెట్టుకుంటారు. ఇప్పుడు జనసేన పరిస్థితి కూడా అలానేఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించుతానని శపథం చేస్తున్నా!! అని ఇటీవల పవన్ ఆవేశప డ్డారు. రాజకీయాల్లో ఉండాల్సింది.. వ్యూహాలే తప్ప.. ఆవేశాలు కాదు. కానీ, పవన్ మాత్రం.. ఆవేశానికే ప్రాధాన్యం ఇచ్చారు.
అంతేకాదు..తనను ప్యాకేజీ పవన్ అంటే.. చెప్పుతో కొడతానని అన్నారు. జనసేన సైన్యం కూడా.. ప్రభుత్వంపై తిరగబడాలని ఆయన పిలుపు నిచ్చారు. అయితే.. చిత్రంగా.. పవన్ ఇన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత.. కూడా.. మంత్రి బొత్స సత్యనారాయణ తాము.. ప్యాకేజీ పవనే అంటామని.. మీడియా ముందు చెప్పారు.
ఇక, మాజీ మంత్రి కొడాలి నాని కూడా.. ఇదే అన్నారు. మరో మాజీ మంత్రి పేర్నినాని అలానే చెప్పారు. ఇక, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా.. ప్యాకేజీ పవన్ ప్యాకేజీ మాటలు తగ్గించాలని ఈసడించారు. మరి ఇంత జరిగినా.. పవన్ ఎవరినీ చెప్పుతో కొట్టలేక పోయారు.
సరే.. ఈ విషయాన్ని పక్కన పెడితే.. శపథం విషయం మాత్రం.. పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అసెంబ్లీలో తన సతీమణిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని. ఇది కౌరవుల సభ అని.. మళ్లీ తాను సీఎంగానే సభలో అడుగు పెడతానని.. శపథం చేశారు.
సో.. అటు జనసేన అధినేత పవన్ శపథం.. ఇటు చంద్రబాబు చేసిన శపథం..రెండు శపథాలను వీరు నెరవేర్చాలంటే.. వైసీపీని గద్దె దింపాలి. ఈ నేపథ్యంలో ఏం చేస్తారు? ఎలా ముందుకు వెళ్తారు? అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది. మరోవైపు.. సంక్షేమ రాజ్యంతో వైసీపీ ముందుకు సాగుతోంది.
1వ తారీకు తెల్లవారుజామునే పింఛన్లు ఇస్తున్నారు. ఆరోగ్య శ్రీ సేవలు పెంచుతున్నారు. ఇంటి డాక్టర్ కాన్సెప్ట్ తెస్తున్నారు. మరిన్ని పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇలా.. అనేక రూపాల్లో వైసీపీ ప్రజలకు చేరువ అవుతోంది. మరి ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు ఎలా తమ శపథాన్ని నెరవేర్చుకుంటాయి. వైసీపీకి ఎలాంటి చుక్కలు చూపించనున్నాయి? అనేది ఆసక్తిగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.