Begin typing your search above and press return to search.
పోలవరాన్ని శాపంగా మారుస్తారా? జగన్ పై టీడీపీ జనసేన యుద్ధం
By: Tupaki Desk | 18 July 2022 7:04 AM GMTపోలవరం ప్రాజెక్టు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం వృథా చేసిన ప్రజా ధనం విలువ రెండున్నర లక్షల కోట్లు. ప్రజాధనం వృథానే కాదు విలువైన కాల హరణం కూడా ! నీటిని సముద్రం పాలు చేసి ఎందుకూ పనికి రాకుండా ప్రాజెక్టును మిగిల్చిన వైనంపై విపక్షాలు ముఖ్యంగా జనసేన భగ్గు మంటోంది. ఇప్పటికిప్పుడు ప్రాజెక్టు ఎత్తు మారుస్తాం అని చెప్పడం అంటే మరోసారి ప్రజాధనం వృథాకు అవకాశం ఇవ్వడమే.. అంటే వరదలు వచ్చిన ప్రతిసారీ ప్రాజెక్టు ఎత్తు పెంచుకుంటూ పోతారా? అని నిలదీస్తున్నాయి విపక్షాలు.ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు పెంపునకు రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకోవడం అస్సలస్సలు సబబుగాలేదని అంటున్నాయి.
అదిగో పోలవరం ఇదిగో పోలవరం అంటూ వరుస ప్రకటన జారీనే తప్ప ప్రాజెక్టు పూర్తిపై ప్రభుత్వంకు చిత్తశుద్ధి లేదని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. భారీ వానల కారణంగా ప్రాజెక్టులో నీటి నిల్వకు అవకాశం ఆశించిన స్థాయిలో లేకుండా పోయింది. దీంతో వరుణుడి దయ ఎంత ఉన్నా నీళ్లన్నీ ఎప్పటిలానే సముద్రం పాలయిపోయాయి. ప్రాజెక్టు డిజైన్ కు సంబంధించి కూడా ప్రస్తుత ప్రభుత్వానికి ఏ పాటి అవగాహన కూడా లేదని విపక్షం అంటోంది.
ఉన్నంత మేర తామే 70 శాతంకు పైగా ప్రాజెక్టు పూర్తి చేసి ఇచ్చినా లాభం లేకుండా పోయిందని టీడీపీ అంటోంది. ముఖ్యంగా పోలవరం అన్నది బహుళార్థ సాధక ప్రాజెక్టు. అటు సాగు ఇటు తాగు నీటితో పాటు ఇంకా వీలుంటే జల విద్యుత్ ఉత్పత్తికీ అనువైన ప్రాజెక్టు. కానీ ఏళ్ల తరబడి కాలయాపన కారణంగానే ప్రాజెక్టు లక్ష్యాలన్నవి నెరవేరకుండా పోతున్నాయి అన్న విమర్శలే అధికంగా ఉన్నాయి.ఈ నేపథ్యంలో జనసేన స్పందించింది.
ఇప్పటిదాకా నిర్వాసితులకు ఇచ్చిందేం లేదని..అంతేకాకుండా వరద ప్రభావిత ప్రాంతాలను అంచనా వేయడంలోనూ ఈ ప్రభుత్వం విఫలం అయిందని పెదవి విరుస్తోంది. కొన్ని చోట్ల సహాయక చర్యలు మందకొడిగా సాగుతున్నాయన్న సమాచారం కూడా ఉంది.
"పోలవరం వద్ద 48 గేట్లను ఎందుకు ఎత్తివేయాల్సి వచ్చింది? ఆ గేట్లకు వరద నీటిని అడ్డుకునే శక్తి లేదంటారా? అందుకే దాదాపు 900 టీఎంసీ ల నీటిని వృధాగా సముద్రంలోకి వదిలేయక తప్పలేదంటారా? ఫ్లడ్ మేనేజ్మెంట్ పై ఈ ప్రభుత్వానికి కనీస అవగాహన లేదా? 900 టీఎంసీ ల నీరు అంటే విలువ ఎంతో తెలుసా? నిపుణుల అంచనా ప్రకారం దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలట!" అని జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ కూసంపూడి చెబుతున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ దగ్గర వరద ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ వరద బాధితుల సమస్యలు అలానే ఉన్నాయి. చాలా చోట్ల నిలువ నీడ లేకుండా అవస్థపడుతున్నారు. కొన్నింట నీట మునిగిన ఇళ్లలోనే కాలం వెచ్చిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్వహణ కు సంబంధించి ఎప్పటి నుంచో ఉన్న సందేహాలు అన్నీ నిజం అయ్యే విధంగానే వరద ముంపు వేధిస్తోంది. ఇప్పటికిప్పుడు నష్ట నివారణ చర్యలు చేపట్టినా ఫలితాలు మాత్రం అంత వేగంగా వచ్చే అవకాశాలే లేవని నిపుణులు అంటున్నారు.