Begin typing your search above and press return to search.
ఆంధ్రజ్యోతి ఆర్కే అలా చేశారంటున్న తమ్ముళ్లు
By: Tupaki Desk | 21 Jun 2019 5:15 AM GMTమొన్నటి వరకు వినిపించిన అంచనాలు నిన్న నిజమైన పరిస్థితి. నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అన్న రీతిలో పార్టీలను కోలుకోకుండా చేసేందుకు ఏమేం చేయొచ్చో చేసి చూపించిన బాబుకు.. బీజేపీ ఇస్తున్న షాకులు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏపీలో తెలుగుదేశం పార్టీ అన్నది కనుమరుగు అయ్యేలా కదుపుతున్న పావులు ఇప్పుడా పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
కాకినాడలో కాపు సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతలు సమావేశం కావటం తెలిసిందే. పెద్ద ఎత్తున నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు. టీడీపీని తుదిముట్టించే విషయంలో ఏమేం చేయాలన్న దానిపై బీజేపీ సెట్ చేసిన ప్లాన్ కు తగ్గట్లే ఆ మీటింగ్ సాగినట్లు చెబుతున్నారు.
బాబు రాజకీయ వారసుడిగా చెప్పే నారా లోకేశ్ ను టార్గెట్ చేసిన ఈ సమావేశంలో మరో ఆసక్తికర కోణం బయటకు వచ్చింది. బాబుకు అత్యంత సన్నిహితుడిగా.. బాబు పార్టీ వాయిస్ ను తన మీడియాలో ప్రముఖంగా వినిపిస్తారన్న పేరున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రస్తావన ఈ సమావేశంలో ప్రముఖంగా వచ్చినట్లుగా చెబుతున్నారు.
కీలకమైన ఏపీ ఎన్నికల్లో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్పిన వారికే టీడీపీ సీట్లు.. కోట్లు ఇచ్చారంటూ టీడీపీ కాపు ప్రజాప్రతినిధులు ఆరోపించం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల వేళలో నిధులు ఒక సామాజిక వర్గానికే ఎక్కువగా ఇచ్చినట్లుగా ఆరోపణలు చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం నేతల కంటే కమ్మ సామాజిక వర్గం అభ్యర్థులకే పార్టీ ఫండ్ ఎక్కువగా ఇచ్చినట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి బాబుకు సన్నిహితులందరి మీదా గురి పెట్టిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.