Begin typing your search above and press return to search.
రాజధాని లో టీడీపీ నేతలకి ఎన్ని ఎకరాలున్నాయంటే ?
By: Tupaki Desk | 18 Dec 2019 5:35 AM GMTప్రస్తుత ప్రతిపక్ష నేత , గత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ..మాటకొస్తే నేను ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ ని, రాజధాని ని నేనే నిర్మించాను అని చాలా గొప్పలు చెప్పుకుంటుంటారు. అలాగే ఎన్నికలలో ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇంకా ఏపీ రాజధానిని నేనే కట్టేది ..ఈ వైసీపీ ప్రభుత్వం రాజధానిని నాశనం చేస్తుంది అని చెప్తుంటారు. దీనితో బాబు గారు అమరావతి పై ఎంత ప్రేమ చూపించారో మొత్తం చిట్టా అంతా బయటపెట్టారు ..వైసీపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజు ప్రత్యేకంగా అమరావతి అంశం పై చంద్రబాబు అవినీతి చిట్టా మొత్తం బయటపెట్టేసారు. సాక్ష్యాధారాలతో సహా సభకు వచ్చిన ఆర్థిక మంత్రి బుగ్గన.. డీటెయిల్డ్ గా టీడీపీ మోసాన్ని బైటపెట్టారు.
గ్రాఫిక్స్ వీడియోని టెలికాస్ట్ చేస్తూ హెరిటేజ్ కి ఎక్కడ స్థలం ఉందో చూపించారు. మొత్తం 4070 ఎకరాలను టీడీపీ నాయకులు, వారి అనుచరులు ముందే కొనిపెట్టుకున్నారని చెప్పారు. అప్పటి మంత్రి నారాయణ తన సంస్థలో పనిచేసే ఉద్యోగుల పేరుతో 55.27 ఎకరాలు కొన్నారని, ఆధారాలు లేని స్థలాలు వీరికి చాలానే ఉన్నాయని చెప్పారు. అలాగే పరిటాల సునీత తన అల్లుడి పేరుతో, యనమల రామకృష్ణుడు తన అల్లుడి పేరుతో కొన్న ఆస్తుల వివరాలు కూడా బైట పెట్టారు.
ఇక నారా లోకేష్ పేరుని అడ్డం పెట్టుకుని ఎంతమంది ఎన్ని ఎకరాలను సమకూర్చుకుందీ సవివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. ఉదయం అసెంబ్లీ నుంచి వాకవుట్ చేసి, తిరిగి సభకు వచ్చిన చంద్రబాబు అండ్ కో.. బుగ్గన ప్రజెంటేషన్ చూసి షాక్ అయ్యారు అసలు వాకవుట్ చేసి తిరిగి మళ్లీ సభలోకి ఎందుకొచ్చామా అంటూ జుట్టు పీక్కున్నారు టీడీపీ నేతలు.
శివరామ కృష్ణన్ కమిటీ రిపోర్ట్ ని సైతం పక్కనపెట్టి, ఓ ప్లాన్ ప్రకారమే అమరావతిలో రాజధాని నిర్మాణం చేపట్టారని, ఇక్కడ రాజధాని కట్టాలంటూ ప్రజాభిప్రాయ సేకరణ చేశారని అది కూడా ఫోన్లో జరిగిందని ఎద్దేవా చేశారు బుగ్గన. పూర్తిగా వ్యాపారస్తులతో నారాయణ కమిటీ ఏర్పాటు చేసి దాని ప్రకారం రాజధానిని నిర్ణయించి రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంలో పడేశారని మంత్రి బుగ్గన విమర్శించారు.