Begin typing your search above and press return to search.

వైసీపీ ఎంపీ గాలి తీసేసిన టీడీపీ నేత

By:  Tupaki Desk   |   12 Sep 2021 5:33 AM GMT
వైసీపీ ఎంపీ గాలి తీసేసిన టీడీపీ నేత
X
వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు గాలిని టీడీపీ సీనియర్ నేత తీసేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 50 సీట్ల కన్నా రాదని చెప్సిన రఘురామ చెప్పిందంతా అబద్ధమే అని టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. అనంతపురంలో కమ్మ భవన్ లో జరిగిన పార్టీ నేతల సమావేశంలో జేసీ మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ మళ్ళీ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అప్పుడు ఎంపి సర్వే అయినా ఇపుడు జేసీ జోస్యంలో అయినా రెండు పాయింట్లు కీలకంగా ఉన్నాయి. ఆ రెండు పాయింట్లు ఏమిటంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 50 సీట్ల కన్నా రావని ఎంపి చెప్పారే కానీ టీడీపీ అధికారంలోకి వస్తుందని మాత్రం చెప్పలేదు. కాకపోతే ఆయన మనసులో మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోయి చంద్రబాబునాయుడు మళ్లీ సీఎం కావాలని చాలా బలంగా ఉందని అర్ధమైపోతోంది.

అయితే టీడీపీ అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పే ధైర్యం చేయలేకపోయారు. అలా చెబితే అందరూ తన సర్వే ఫలితాలను చూసి నవ్వుకుంటారని ఎంపి వెనుకంజ వేశారు. కాకపోతే ఎంపి మనసులో ఉన్నది మాత్రం ఇదే. ఇక జేసీ తాజా జోస్యం విషయాన్ని చూస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ ఓటమి ఖాయమని చెప్పారు. అంతేకానీ మళ్ళీ వైసీపీనే అధికారంలోకి వస్తుందన్న మాట మాత్రం చెప్పలేదు. కాకపోతే టీడీపీకి మళ్ళీ ఓటమి ఖాయమని చెప్పారంటే పరోక్షంగా మళ్ళీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని చెప్పటమే.

వైసీపీ ఎంపీగా ఉండి అధికార పార్టీ ఓడిపోతుందని ఎంపి చెప్పడం, అలాగే టీడీపీ నేతగా ఉండి టీడీపీ ఓటమి ఖాయమని జేసీ ప్రభాకర్ రెడ్డి జోస్యం చెప్పటమే విచిత్రంగా ఉంది. మరిద్దరు చెప్పిన దాంట్లో ఎవరు చెప్పింది నిజమనే చర్చ మొదలైంది. క్షేత్రస్థాయిలో పరిస్ధితులను జాగ్రత్తగా గమనిస్తే జేసీ చెప్పిందే నిజమయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకతంతా టీడీపీలోను చంద్రబాబుకు మద్దతిచ్చే మీడియాలోనే ఎక్కువగా కనబడుతోంది.

వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగాల్సినంత అభివృద్ధి పనులు జరగటం లేదన్నది వాస్తవమే. అయితే ఇదే సమయంలో సమాజంలోని చాలావర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నది కూడా నిజమే. పథకాల అమలులో ఎక్కడైనా లోపాలు కూడా ఉండవచ్చు. అంతమాత్రాన జగన్ను అధికారంలో నుంచి దింపేయాలన్న వ్యతిరేకత అయితే జనాల్లో లేదన్నది వాస్తవం. ఇదే సమయంలో టీడీపీ కూడా పుంజుకోలేదన్నది వాస్తవం. కాబట్టి వచ్చే ఎన్నికలు మాత్రం చాలా ఆసక్తిగా ఉంటుది. చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో.