Begin typing your search above and press return to search.

ఒకే రోజు బాబుకు రెండు షాకులు..

By:  Tupaki Desk   |   21 Oct 2019 7:29 AM GMT
ఒకే రోజు బాబుకు రెండు షాకులు..
X
మారిన కాలానికి తగ్గట్లు.. పాత సామెతల్ని యథాతధంగా చెప్పలేని పరిస్థితి. కొన్ని సామెతలకు అయితే నొచ్చుకునే పరిస్థితి. అయితే.. కొన్నిసార్లు ఎన్ని మాటల్లో చెబితే కానీ రాని ఎఫెక్ట్ చిన్న సామెతతో ఇట్టే చెప్పేయొచ్చు. తాజాగా ఏపీ విపక్షంలో చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే.. అనిపించేది ఒక్కటే.. ఉన్నది పోయే.. ఉంచుకున్నది పోయే అన్న సామెత గుర్తుకు రాక మానదు.

తన రాజకీయ స్వార్థం కోసం రెండు కత్తుల్ని ఒక ఒరలో ఇమడ్చాలన్న ప్రయోగం చేసిన చంద్రబాబుకు తగిన శాస్తి జరిగిందని చెప్పాలి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత దారుణమైన ఓటమికి గురైన టీడీపీకి.. ఆ తర్వాతి కాలంలో పార్టీ నేతలు ఒక్కొక్కరుగా వీడిపోతున్న పరిస్థితి. బాబుకు కళ్లు.. చెవులుగా చెప్పుకునే నేతలు పార్టీ మారిపోయారు. పార్టీకి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకునే వారే బాబుకు అంతలా హ్యాండిచ్చినప్పుడు మిగిలిన వారు సైతం కామ్ గా ఉంటారా? అందునా.. పవర్ కోసం విపరీతంగా తపించే వారు ఉత్తనే ఉండిపోలేరు కదా? అందుకే.. ఎవరి దారి వారు చూసుకుంటున్న పరిస్థితి.

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సంగతే చూస్తే.. కడపలో పార్టీని బలోపేతం చేయటం కోసం.. అదిని తీసుకొచ్చారు. ఇప్పుడాయన బీజేపీలో చేరిపోయారు. ఆదిని తెచ్చిన క్రమంలో.. ఎంతోకాలంగా పార్టీని నమ్ముకున్న రామసుబ్బారావుకు చంద్రబాబు ఎంతలా హ్యాండిచ్చారో తెలిసిందే. ఒకే రోజు ఈ ఇద్దరు నేతలు వేర్వేరు పార్టీల ముఖ్యనేతలతో కలవటం ఆసక్తికరంగా మారింది. ఆది అయితే ఏకంగా బీజేపీలో చేరిపోతే.. రామసుబ్బారెడ్డి మాత్రం ఎయిర్ పోర్ట్ లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఆయన పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

తాజా పరిణామాలు చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. స్వార్థ రాజకీయం కోసం పావులు కదిపితే.. పవర్ కోసం వచ్చే వారు తర్వాతి కాలంలో హ్యాండివ్వటమే కాదు.. అవకాశం కోసం నమ్ముకున్న పార్టీలో ఎంతో కాలంగా వెయిట్ చేసే వారు సైతం తమ దారి తాము వెతుక్కోవటం ఖాయమన్న నీతి తాజా పరిణామం ద్వారా స్పష్టమవుతుందని చెప్పక తప్పదు.