Begin typing your search above and press return to search.
కీలక మంత్రిపై గట్టి అభ్యర్థిని దింపుతున్న టీడీపీ!
By: Tupaki Desk | 26 Oct 2022 5:32 AM GMTవైసీపీలో దూకుడుగా వ్యవహరిస్తున్న నేతల్లో కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఒకరు. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లడం ద్వారా జోగి రమేష్.. సీఎం వైఎస్ జగన్ వద్ద మంచి మార్కులు కొట్టేశారు. అంతేకాకుండా అసెంబ్లీలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును వెధవ, దుష్టుడు, నీచుడు అంటూ దూషించి జగన్ అభినందనలు కూడా అందుకున్నారు.
దీంతో జగన్ రెండో మంత్రివర్గ విస్తరణలో తన జిల్లాకే చెందిన కొలుసు పార్థసారథిలాంటి వారిని పక్కకునెట్టి జోగి రమేష్ మంత్రిగా చాన్సు కొట్టేశారు. కీలకమైన గృహనిర్మాణ శాఖ మంత్రిగా జోగికి జగన్ పదవిని కట్టబెట్టారు.
తనకు కలసి వచ్చిన దూకుడునే జోగి రమేష్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై తీవ్రంగా మాటల దాడి చేస్తున్నారు. దీంతో ప్రతిపక్షాల హిట్‌లిస్టులో జోగి రమేష్ కూడా చేరిపోయాయి. వచ్చే ఎన్నికల్లో జోగి రమేష్‌ను ఎలాగైనా ఓడించాలని టీడీపీ, జనసేన రెండూ కంకణం కట్టుకున్నాయి.
ఈ నేపథ్యంలో టీడీపీ తరపున కొనకళ్ల నారాయణను పెడన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో 2009, 2014ల్లో కొనకళ్ల నారాయణ బందరు (మచిలీపట్నం) ఎంపీగా టీడీపీ తరఫున విజయం సాధించారు. 2019లో వైసీపీ అభ్యర్థి బాలశౌరి చేతిలో కొనకళ్ల ఓyì పోయారు. ఈసారి పార్లమెంటుకు కాకుండా కొనకళ్ల నారాయణను పెడన నుంచి బరిలోకి దింపాలని టీడీపీ యోచిస్తోంది.
కాగా జోగి రమేష్ 2014లో మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జోగి రమేష్ ఆర్టీసీ జోనల్ చైర్మన్‌గా పనిచేశారు.
తమపై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్న జోగి రమేష్‌ను ఎలాగైనా ఓడించాలని టీడీపీతోపాటు జనసేన కూడా గట్టి పట్టుదలతో ఉన్నాయని అంటున్నారు. అందులోనూ ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉండటంతో జోగి రమేష్ చిత్తవడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.