Begin typing your search above and press return to search.
అందరూ అసెంబ్లీ రౌడీలే
By: Tupaki Desk | 19 Dec 2015 7:18 AM GMTఏపీ శాసనసభ శీతాకాల సమావేశాలు గట్టిగా మూడు రోజులు కూడా పూర్తిచేసుకోకముందే మంటలు రేపాయి. తొలిరోజు నుంచే వేడి పుట్టించాయి. ముందెన్నడూ లేనంత రచ్చను రాష్ట్ర ప్రజలకు చూపించాయి. తిట్టు - దురుసు ప్రవర్తనతో సభ పరువు తీశారు. ఒక్క మాటలో చెప్పాలంటే దూషణ పర్వంలో ప్రస్తుత ప్రతిపక్షం ఇంతకుముందున్న అన్ని ప్రతిపక్షాలనూ మించిపోయిందని రాజకీయ పండితులు చెబుతున్నారు. శాసనసభలో కొట్టుకోవడం ఒక్కటి తప్ప అన్నీ ఈసారి చూశామని అంటున్నారు.
శుక్రవారమైతే సభలో రాద్దాంతం తారస్థాయికి చేరింది. పాయింట్ ఆఫ్ ఆర్డర్ మీద గొడవ జరుగుతున్న సమయంలో జగన్ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు నిందితులతో కలిసి చంద్రబాబు సెక్స్ రాకెట్ నడిపారని ఆరోపించారు ఇందులో ఆయన, ఆయన కొడుకు కూడా పాలుపంచుకున్నారని ఆరోపించారు. దీంతో పాలక పక్షం నుంచి మంత్రి అచ్చెన్నాయుడు లేచి జగన్ పైనా అంతేస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ కు మెంటల్ ఉందని... ఆయన్ను ఆసుపత్రిలో చూపించాలని అన్నారు.
మూడు రోజుల సభలో తిట్టుకున్న తిట్లలో కొన్ని..
''చంద్రబాబు, లోకేశ్ లు కలిసి సెక్స్ రాకెట్ నడుపుతున్నారు''
- జగన్
''జగన్ కు మెంటల్... ఆసుపత్రిలో చూపించాలి... కాల్ మనీ నిందితులకంటే ఆయన పెద్ద నేరగాడు. రాష్ట్రంలో ఏ నేరం జరిగినా వైసీపీ నేతలకు , జగన్మోహన్ రెడ్డికి అందులో భాగస్వామ్యం ఉంది. ఏటీఎమ్ దొంగతనాలు, ఎర్రచందనం దొంగతనం కేసుల్లో కూడా జగన్ ఉన్నాడు.. బుద్దీజ్ఞానం లేనోడు''
- అచ్చెన్నాయుడు
''ఆడు సైకో గాడు - అచ్చెన్నాయుడు గాడు సైకోగాడండి. ఆడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే మైకిస్తారా''
- స్పీకరుతో వైసీపీ ఎమ్మెల్యేలు
...ఇంకా చాలాపెద్దపెద్ద మాటలన్నీ అసెంబ్లీలో వినిపించాయి. ఇక దొంగలు - పందికొక్కులు - నీచులు - బలిసి కొట్టుకుంటున్నారు, వెధవ - మెంటల్ గాడు - బుర్రలేనోడు వంటి పదాలైతే ఇష్టమొచ్చినట్లుగా వాడేశారు. మొత్తానికి శాసనసభ పరువును రోడ్డున పడేశారు.