Begin typing your search above and press return to search.
అయ్యన్నా.. ఏమిటీ భజన.. లెక్క ఏమిటి?
By: Tupaki Desk | 2 Aug 2020 12:30 PM GMTకాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ వాస్తవాన్ని అనుక్షణం గుర్తుంచుకున్న వారెవరూ అదే పనిగా మాట్లాడరు. ఒకవేళ మాట్లాడినా ఆచితూచి అన్నట్లుగా పొదుపుగా మాట్లాడతారు. రాజకీయాలు అన్నాక ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలే కానీ మడి కట్టుకు కూర్చుంటే పదవులు రావు. అందుకే.. నోటి వెంట వచ్చే మాటను పెద్దగా పట్టించుకోకుండా అవసరానికి తగ్గట్లుగా మాట్లాడే వారే ఎక్కువగా కనిపిస్తారు. అందుకు ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు మినహాయింపేమీ కాదు.
టీడీపీ పుట్టినప్పటి నుంచి అయ్యన్న ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు. నికార్సైన టీడీపీ నేతగా తనను తాను చెప్పుకునే అయ్యన్నలో హటాత్తుగా మార్పు వచ్చేసింది. గతానికి భిన్నంగా ఆయనిప్పుడు మోడీ భజన షురూ చేశారు. ఈ నెల ఐదున అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించిన కీలకమైన భూమిపూజ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో రామాలయానికి కర్మ.. కర్త.. క్రియ.. అన్ని మోడీ వారేనన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి.
అయోధ్యలో రామాలయం సాకారమైందంటే దానికి కారణం మోడీనే అని ఆకాశానికి ఎత్తేస్తున్న అయ్యన్న.. ఏళ్ల తరబడి హిందువుల కలను తీరుస్తారని చెబుతున్నారు. వాజ్ పేయ్.. అద్వానీ లాంటి వారెంత అనుకున్నాసాధ్యం కానిది మోడీకి సాధ్యమైనదన్న ఆయన.. ప్రతి హిందువు పది రూపాయిల చొప్పున అయోధ్య రామాలయానికి విరాళం ఇవ్వాలన్న విచిత్రమైన కోరికను కోరారు. ఆ మాటకు వస్తే.. కరుడు కట్టిన హిందుత్వ సంస్థగా చెప్పే సంఘ్ పరివార్ కు సైతం ఇలాంటి ఐడియా రాలేదు. ఇక.. బీజేపీ నేతల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు.
అంతలా మాట్లాడుతున్న అయ్యన్న బ్యాక్ గ్రౌండ్ లో ఏమైనా సంఘ్ ఉందా? అని చూస్తే లేదనే చెప్పాలి. అంతేనా.. అయోధ్యలో వివాదాస్పద కట్టటం కూలినప్పుడు సెక్యులరిజం.. మతతత్వం అంటూ పెద్ద పెద్ద మాటల్ని మాట్లాడిన అపర సెక్యులరిస్టుల్లో అయ్యన్న ఒకరు అలాంటి. అలాంటి ఆయన అయోధ్యలో రామాలయాన్ని అంతలా కీర్తించటం వెనుక కారణం.. వయసు తెచ్చిన మార్పా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ మోడీని.. రామాలయాన్ని అంతలా కీర్తిస్తున్న అయ్యన్న తీరు ఇప్పుడు కొత్త చర్చకు తావిస్తోంది. రాజకీయ నేత ఎవరి నోట ఊరికే మాటలు రావు. అలా వచ్చాయంటే ఏదో లెక్క ఉన్నట్లే? అయ్యన్నా.. ఏంది కత.. కొత్త రాజకీయం షురూ చేశారా ఏంది?