Begin typing your search above and press return to search.
ఈసీ భారీ షాక్ : బాబుకు అలా.. పవన్ కి ఇలా...?
By: Tupaki Desk | 14 July 2022 9:41 AM GMTకేంద్ర ఎన్నికల సంఘం ఒకే మారు టీడీపీ అధినేత చంద్రబాబుకు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి భారీ షాక్ ఇచ్చేసింది. దాంతో ఈ రెండు రాజకీయ పార్టీలతో పాటు తెలుగు రాజకీయాల్లో కూడా దాని మీద చర్చ వాడిగా వేడిగా సాగుతోంది. ముందుగా చంద్రబాబు విషయానికి వస్తే ఆయన టీడీపీని జాతీయ పార్టీగా చెప్పుకుంటున్నారు. కానీ అది కేవలం ప్రాంతీయ పార్టీ మాత్రమే. ఆ విషయంలో ప్రత్యర్ధులు ఎన్ని విమర్శలు చేసినా చంద్రబాబు మాత్రం తాను జాతీయ ప్రెసిడెంట్ అని తన కుమారుడు లోకేష్ బాబు జాతీయ ప్రధాన కార్యదర్శి అని పేర్కొంటూ వస్తున్నారు.
ఇక ఏపీకి అచ్చెన్నాయుడుని అధ్యక్షుడిగా నియమించారు. తెలంగాణాకు మరో నేతను ఎన్నుకున్నారు. ఇలా రెండు రాష్ట్రాలలో టీడీపీ ఉందని చూపిస్తున్నారు. అయితే లేటెస్ట్ గా కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని రాజకీయ పార్టీలు వాటి హోదాలు, ప్రస్తుతం ఉనికిలో ఉన్న పార్టీల వివరాలు అంటూ ఒక జాబితాను విడుదల చేసింది. దాని ప్రకారం చూస్తే దేశంలో కేవలం ఎనిమిది పార్టీలకు మాత్రమే జాతీయ హోదా గుర్తింపు ఉంది.
ఆ లెక్కన చూస్తే బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, బీఎస్పీ ఉన్నాయి. మరి ఆ లిస్ట్ లో ఎక్కడా టీడీపీ లేదు. టీడీపీని ఒక ప్రాతీయ పార్టీగా తెలుగు రాష్ట్రాలలో ఉన్న వైసీపీ, టీయారెస్ ల పక్కన పేర్కొంది. దాంతో చంద్రబాబు తన పార్టీ జాతీయ స్థాయి హోదా కలిగినది అని ఏ కోశానా ఇక మీదట క్లెయిం చేయలేని పరిస్థితి ఉంది.
నిజానికి జాతీయ పార్టీ హోదా సాధించాలీ అంటే నాలుగు రాష్ట్రాలలో ఆరు శాతం ఓట్లు సార్వత్రిక ఎన్నికల్లో సాధించాలి. అంతే కాదు, అక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు అయినా ఉండాలి. టీడీపీకి తెలంగాణాలో కొంత ఉనికి తప్ప దేశంలో మరే రాష్ట్రంలోనూ ఆ పార్టీ ఉనికి లేదు, దాంతో జాతీయ పార్టీ ఎలా అవుతుంది అన్న ప్రశ్నకు జవాబు ఆ పార్టీయే చెప్పాలి అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారు.
తనది జాతీయ పార్టీ అని చెప్పుకోవడానికి చంద్రబాబు ఆరాటపడతారని కూడా ఆయన అంటున్నారు. ఇకనైనా మీ పార్టీ హోదాను ఉప ప్రాంతీయ పార్టీగా మార్చుకోమని ఆయన సూచిస్తున్నారు. సరే చంద్రబాబు సంగతి ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ పార్టీ ప్రస్తుత పరిస్థితి ఎన్నికల సంఘం వద్ద ఎలా ఉందీ అంటే గుర్తింపు లేని పార్టీల జాబితాలో జనసేనను ఉంచారు.
దేశంలో 2,796 గుర్తింపు లేని పార్టీలు ఉంటే అందులో జనసేనను కేంద్ర ఎన్నికల సంఘం చేర్చింది. ఇలా ఎందుకు చేశారు అంటే దానికి కూడా కారణాలు ఉన్నాయి. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక రాజకీయ పార్టీ గుర్తింపు పొందాలీ అంటే ఆరు శాతం ఓట్లను తెచ్చుకోవడంతో పాటు నలుగురు ఎమ్మెల్యేలు అయినా ఉండాలి. అయితే పవన్ కళ్యాణ్ పార్టీ 2019 ఎన్నికల్లో 5 శాతం పైగా ఓట్లతో పాటు ఒక ఎమ్మెల్యే మాత్రం గెలవడం వల్లనే గుర్తింపు పొందలేకపోయారు అని అంటున్నారు.
ఇక 2019 ఎన్నికల్లో జనసేనకు ఇచ్చిన గాజు గ్లాస్ గుర్తుని కూడా ఫ్రీ సింబల్ గా ఎన్నికల సంఘం మార్చేసి మరో షాక్ ఇచ్చేసింది. దేశంలో ఎన్నికల సంఘం వద్ద ఏ పార్టీకి చెందని 197 గుర్తుకు ఉంటే దానిలో గాజు గ్లాస్ కూడా చేరిపోయింది. మరి 2024 ఎన్నికల్లో కామన్ సింబల్ గా మరో మారు దాన్ని తీసుకుని కేంద్ర ఎన్నికల సంఘం నిబంధలన ప్రకారం ఓట్లూ సీట్లు తెచ్చుకుంటే గుర్తింపు దక్కడంతో పాటు గాజు గ్లాస్ గుర్తు కూడా శాశ్వతం అవుతుంది. మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం తాజా వివరాలతో ఏపీలో బాబు, పవన్ లకు షాక్ ఇచ్చేసింది అనే అంటున్నారు.