Begin typing your search above and press return to search.

ఇలాంటి చలివేంద్రాన్ని ఇంకెవరూ పెట్టలేరేమో?

By:  Tupaki Desk   |   29 April 2016 5:38 AM GMT
ఇలాంటి చలివేంద్రాన్ని ఇంకెవరూ పెట్టలేరేమో?
X
ఎండాకాలం వస్తే చాలు.. దాహం తీర్చటం కోసం చలివేంద్రాలు స్టార్ట్ చేయటం కామన్. పెద్ద పెద్ద మట్టి కుండల్ని ఏర్పాటు చేసి.. తాటి తడికెలతో షెడ్డు లాంటివి వేసి.. చల్లని నీళ్లను రోడ్డు మీద వెళ్లే అందరికి ఉచితంగా పంపిణీ చేయటం చూస్తుంటాం. కొన్ని చోట్ల మాత్రం ఇందుకు భిన్నంగా మజ్జిగ కూడా సరఫరా చేస్తారు. కానీ.. ఇలాంటివి చాలా.. చాలా అరుదుగానే చెప్పాలి.

కానీ.. మీకు ఇప్పుడు చెప్పబోయే చలివేంద్రం సో స్పెషల్ అని చెప్పక తప్పదు. నిజానిక ఈ ఐడియా అదిరిపోవటమే కాదు.. ఇలాంటి చలివేంద్రాన్ని స్టార్ట్ చేయాలంటే దమ్ము కావాల్సిందే. ఇంతకూ అంతగా బిల్డప్ ఇస్తున్న చలివేంద్రం ఏమిటంటారా? తాటి ముంజల చలివేంద్రం. మీరు చదివింది నిజమే. ఖరీదు పలికే తాటి ముంజల్ని ఉచితంగా సరఫరా చేయటం.. అది కూడా చలివేంద్రంగా ఏర్పాటు చేసి అంటే చిన్న విషయం కాదు. అలాంటి వినూత్న చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి జనాల మనసుల్ని దోచుకునే ప్రయత్నం చేశారు నెల్లూరు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు.

నెల్లూరు పట్టణంలో ఆయన తాటిముంజల చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉచితంగా తాటి ముంజల్ని పంపిణీ చేయటమే కాదు.. చలివేంద్రం మీదుగా వెళుతున్న వారిని పిలిచి మరీ చేతిలో తాటి ముంజెను పెట్టి చిన్నసైజు స్వీట్ షాక్ ఇచ్చారు. వేసవి తాపాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారు. గుక్కెడు నీళ్లు ఇవ్వటమే గొప్ప అనుకునే ఈ రోజుల్లో.. తాటి ముంజెల్ని చలివేంద్రం పెట్టి ఇవ్వటం గొప్పే. ఇప్పుడు చెప్పండి.. ఈ తరహా చలివేంద్రాన్ని ఎవరైనా స్టార్ట్ చేయగలరా?