Begin typing your search above and press return to search.

టీడీపీకి మద్దతిచ్చిన విలేకరులకు 75లక్షల ఫ్లాట్స్!

By:  Tupaki Desk   |   19 Sep 2019 1:20 PM GMT
టీడీపీకి మద్దతిచ్చిన విలేకరులకు 75లక్షల ఫ్లాట్స్!
X
అది ఏపీకి నూతన రాజధాని.. సింగపూర్ భాగస్వామ్యంతో కడుతున్నది.. వేల మంది రైతుల మూడు పంటలు పండే భూమిని రాజధాని కోసం త్యాగం చేశారు. చేజిక్కించుకున్న నాటి సీఎం అమరావతిని రాజధానిగా మార్చడానికి పూనుకున్నారు. అమరావతిలో అడుగు భూమికే లక్షల రూపాయలు డిమాండ్ ఉన్న పరిస్థితి. అలాంటిది ఏకంగా 75 లక్షల రూపాయల విలువ చేసే అమరావతిలోని ఫ్టాట్ గిఫ్ట్ గా ఇచ్చేస్తే ఎంత సంబరం.. ఇప్పుడు పచ్చపార్టీకి మద్దతుగా నిలిచిన పచ్చమీడియా జర్నలిస్టులకు పార్టీ చిన్న బాస్ ఇచ్చిన ఈ ఫ్లాట్ గిఫ్ట్ లు మీడియా సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారాయి.

అమరావతి న్యూస్ రిపోర్టర్లు అదృష్టవంతులు అంటూ జర్నలిస్టులు చెవులు కొరుక్కుంటున్నారు. 23 సీట్లతో చచ్చిపోయిందనుకున్న పచ్చ పార్టీకి ప్రతి రోజు ఆక్సిజన్ ఇచ్చేందుకు అమరావతి జర్నలిస్టులకు పచ్చపార్టీ నేత 75 లక్షల ఫ్లాట్స్ గిఫ్ట్ ఇచ్చాడన్న వార్త ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. ఆ గిఫ్ట్ లు ఇచ్చి వారిని సంతృప్తిపరిచి వారితోనే ఇప్పుడు డైలీ కవరేజ్ ప్లానింగ్ చేసుకుంది పచ్చ పార్టీ .

అమరావతి పరిధిలోని తాడేపల్లిలో ప్రధాన ప్రాంతమైన ఓ లగ్జరీ ఏరియాలో ఇప్పుడు వివిధ చానెల్స్ లోని పచ్చపార్టీకి సపోర్టుగా నిలబడ్డ వారికి సొమ్ములు - ఒకే సామాజిక వర్గానికి చెందిన ఎనిమిది మంది రిపోర్టర్ లలో ఐదుగురికి ఒక్కొక్కరికి 75 లక్షల విలువున్న ఫ్లాట్ ఇచ్చేసినట్టు మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. సదురు జర్నలిస్టులు ఇప్పటికే గృహప్రవేశాలు కూడా చేసేసారని చెవులు కొరుక్కుంటున్నారు.

అయితే కొందరు తెలివిగల జర్నలిస్టులు అమరావతి ఫ్లాట్స్ కొంటే భవిష్యత్ లో విచారణలో దొరికితే దెబ్బకు వస్తుందని.. ఏకంగా 75 లక్షల రూపాయలు క్యాష్ తీసుకుని ఖమ్మం‌లో భూములు కొన్నారని సమాచారం. ఇంకో దమ్మున్న చానెల్ రిపోర్టర్ అంతే సొమ్ము తో గుంటూరు లో భూములు కొనుగోలు చేసాడని మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం చినబాబుకి ప్రత్యేక అధికారిగా ఉన్న మాజీ రిపోర్టర్ ఈ వ్యవహారాలను చక్కపెట్టడం లో కీలకపాత్ర పోషించాడని అమరావతి మీడియా మిత్రుల్లో చర్చ జరుగుతోంది.

ఈ భారీ గిఫ్ట్ లు అందుకున్న రిపోర్టర్స్ అంతా తాజాగా పచ్చపార్టీ అధినేత ఈ మధ్య పిలుపునిచ్చిన ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమం ప్రకటన నుంచి ఆయన హౌస్ అరెస్టు వరకు ఏదో భూగోళం అంతమవుతుందన్నట్టు లైవ్/ స్పెషల్ కవరేజ్ ఇచ్చి రుణం తీర్చుకున్నారని జర్నలిస్టులు గుసగుసలాడుకుంటున్నారు. ఇవేవీ తెలియని చానెల్స్ - డెస్కుల్లో ఉన్న సబ్ ఎడిటర్లు - సిబ్బంది తమ జర్నలిస్టు చలో ఆత్మకూరు ఇరగదీశాడని చెప్పుకోవడం కొసమెరుపు. అయితే 75లక్షల ప్యాకేజీ తీసుకునే ఈ జర్నలిస్టులు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారన్న వార్త లీక్ కావడంతో ఇప్పుడంతా ముక్కునవేలేసుకుంటున్నారట..