Begin typing your search above and press return to search.

అక్క‌డ టీడీపీ అభ్య‌ర్థి నామినేష‌న్ రిజెక్ట్‌!

By:  Tupaki Desk   |   27 March 2019 5:24 AM GMT
అక్క‌డ టీడీపీ అభ్య‌ర్థి నామినేష‌న్ రిజెక్ట్‌!
X
ఎన్నిక‌ల వేళ ఒక‌టి త‌ర్వాత మ‌రొక‌టి చొప్పున అధికార టీడీపీకి షాకులు త‌గులుతున్నాయి. అధికార పార్టీ అభ్య‌ర్థుల ఎంపిక మొద‌లు నామినేష‌న్ దాఖ‌లు వ‌ర‌కూ ఎన్నో నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అధికార పార్టీ అభ్య‌ర్థుల నామినేష‌న్ల‌పై గంద‌ర‌గోళం చోటు చేసుకోవ‌టం.. ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు తాజాగా ఒక టీడీపీ అభ్య‌ర్థి నామినేష‌న్ ను తిర‌స్క‌రిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌టం ఇప్పుడా పార్టీకి షాకింగ్ గా మారిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

విజ‌య‌న‌గ‌రం జిల్లా కురుపాం అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థిగా జ‌నార్ద‌న్ థాట్రాజ్ దాఖ‌లు చేసిన నామినేష‌న్ ను రిజెక్ట్ చేస్తూ ఎన్నిక‌ల సంఘం అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న దాఖ‌లు చేసిన నామినేష‌న్ ప‌త్రాల్లో త‌ప్పులు ఉన్నట్లుగా బీజేపీ అభ్య‌ర్థి నిమ్మ‌క జ‌య‌రాజ్.. కాంగ్రెస్ అభ్య‌ర్థి నిమ్మ‌క సింహాచ‌లం వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదుల్ని ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారులు ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నారు.

థాట్రాజ్ ఎస్టీ కాద‌ని హైకోర్టు.. సుప్రీంకోర్టులు గ‌తంలో ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను ఆర్వోకు చూపించిన నేప‌థ్యంలో.. అభ్య‌ర్థి నామినేష‌న్ సంద‌ర్భంగా స‌మ‌ర్పించిన ప‌త్రాల్ని ప‌రిశీలించి.. ఆయ‌న నామినేష‌న్ ను రిజెక్ట్ చేశారు. ఈ ప‌రిణామాన్ని చివ‌రి క్ష‌ణంలో గుర్తించిన అధికార ప‌క్షంలో.. ఆయ‌న‌తో పాటు ఆయ‌న త‌ల్లి న‌ర‌సింహ ప్రియా థాట్రాజ్ చేత నామినేష‌న్ ను వేయించారు.

ఆమె నామినేష‌న్ ను ఎన్నిక‌ల సంఘం ఓకే చేసే అవ‌కాశం ఉందంటున్నారు. మ‌రి.. ఆమె టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతారా? లేదా? అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. అధికార పార్టీ అభ్య‌ర్థి నామినేష‌న్ రిజెక్ట్ కావ‌టం ఇప్పుడా పార్టీలో సంచ‌ల‌నంగా మారింది. అన్ని అంశాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా బ‌రిలోకి దించ‌టం పార్టీ అధినాయ‌క‌త్వం త‌ప్పనే మాట వినిపిస్తోంది.