Begin typing your search above and press return to search.
జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ లకు ఊరట ..బెయిల్ మంజూరు !
By: Tupaki Desk | 5 Aug 2020 3:00 PM GMTతాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలకు ఊరట లభించింది. జిల్లా కోర్టు మూడు కేసుల్లో ఇద్దరికి కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసింది. తాడిపత్రిని వదిలి ఎక్కడకూ వెళ్లకూడదని షరతు పెట్టింది. రేపు(గురువారం) జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లో వీరిద్దరూ ఉన్నారు. బెయిల్ పత్రాలు సెంట్రల్ జైలుకు చేరితే, రేపు వీరు విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు, అన్ని కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ వీరిద్దరూ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు ఇటీవలే కొట్టేసింది.
బీఎస్-3 వాహనాలను బీఎస్- 4 వాహనాలుగా మార్చి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారన్న అభియోగంపై జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. అలాగే నకిలీ ఇన్సూరెన్స్ పేపర్స్ తయారు చేశారన్న దానిపై కూడా జేసి ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసి అశ్విత్‌రెడ్డి పై అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆ కేసులపై జూన్ 13న హైదరాబాద్లో ని శంషాబాద్‌లో వారి నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు.