Begin typing your search above and press return to search.

ప్ర‌కాశం జిల్లాలో బాబు..కేసీఆర్ కాంబినేష‌న్లో ఫ్లెక్సీ

By:  Tupaki Desk   |   4 Oct 2017 7:32 AM GMT
ప్ర‌కాశం జిల్లాలో బాబు..కేసీఆర్ కాంబినేష‌న్లో ఫ్లెక్సీ
X
ప్రకాశం జిల్లాలో పెట్టిన పోస్ట‌ర్ ఒక‌టి ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల్ని విప‌రీతంగా ఆక‌ర్షిస్తున్న ఈ పోస్ట‌ర్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారి చూపు ప‌డేలా చేస్తోంది. ఒక ఫ్లెక్సీ మీద ఊహించ‌ని కాంబినేష‌న్లో త‌యారు చేయించ‌ట‌మే కాదు.. ఆ త‌యారు చేసింది ఏపీ అధికార‌ప‌క్ష‌మైన తెలుగుదేశం పార్టీకి చెందిన కార్య‌క‌ర్త కావ‌టం ఒక విశేషంగా చెప్పాలి.

ఎన్టీఆర్‌.. చంద్ర‌బాబు కాంబినేష‌న్లో ఫ్లెక్సీలు ఎక్క‌డైనా క‌నిపిస్తాయి. కానీ.. వీరిద్ద‌రితో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి.. టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను కూడా క‌లిపేసి.. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే తో త‌యారు చేయించిన ఫ్లెక్సీ ఇప్పుడు అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. ఇంత‌కీ ఈ ఫ్లెక్సీ ఏ కార్య‌క్ర‌మంలో భాగంగా పెట్టారో తెలిస్తే మ‌రింత ఆశ్చ‌ర్య‌పోవ‌టం ఖాయం. పార్టీని ప్ర‌జ‌ల్ని మ‌రింత విస్తృత ప‌రిచే క్ర‌మంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం పేరిట ఒక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా బాబు.. కేసీఆర్ కాంబినేష‌న్లో ఫ్లెక్సీ తయారు చేయించ‌టం గ‌మ‌నార్హం.

ప్ర‌కాశం జిల్లాలోని బ‌ల్లికుర‌వ మండ‌లం వెల‌మ‌వారి పాలెంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జంపింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ హాజ‌ర‌య్యారు. ప్రస్తుతం ఏపీ అధికార‌ప‌క్షంలో ఉన్న ఆయ‌న్ను పార్టీ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించిన క్ర‌మంలో ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇందులో పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ తో పాటు పార్టీ అధినేత చంద్ర‌బాబు ఫోటోను వేశారు. అయితే.. ఇందులో కేసీఆర్ ఫోటో వేయ‌టం గ‌మ‌నార్హం. పార్టీ కార్య‌క్ర‌మానికి.. మ‌రో పార్టీ అధినేత ఫోటోను వేయ‌టం ఆస‌క్తిక‌ర‌మైన అంశంగా చెప్పాలి. ఎందుకిలా అంటే కీల‌క‌మైన అంశాన్ని చెబుతున్నారు.

ఈ ఫ్లెక్సీని త‌యారు చేయించింది టీడీపీ కార్య‌క‌ర్త మామిళ్ల‌ప‌ల్లి ప్ర‌వీణ్ కుమార్‌. అయితే.. ఆయ‌న‌ది.. టీఆర్ఎస్ పార్టీ కాదు. కాకుంటే కేసీఆర్ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి. మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వెల‌మ‌వారి పాలెంలో 90 శాతం మంది ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. ఆ గ్రామానికి స‌ర్పంచ్ అయిన మామిళ్ల పల్లి ప్ర‌వీణ్ కుమార్ టీడీపీకి చెందిన నేత‌. ఆయ‌న తండ్రి కూడా టీడీపీలో మొద‌టి నుంచి చురుగ్గా వ్య‌వ‌హ‌రించేవారు. పార్టీ ప‌రంగా బాబు.. సామాజిక‌వ‌ర్గ నాయ‌కుడిగా కేసీఆర్ మీద త‌న‌కున్న అభిమానాన్ని తాను ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్ర‌ద‌ర్శించార‌ని చెప్పాలి.