Begin typing your search above and press return to search.
దూకుడుగా వచ్చి పోలీసులకు లొంగిపోయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
By: Tupaki Desk | 27 May 2020 8:45 AM GMTటీడీపీలో ఫైర్ బ్రాండ్.. అధికారులపై దూషించి వివాదాస్పదంగా వ్యవహరించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయాడు. మాజీ తహసీల్దార్ ను దూషించి బెదిరించారనే ఆరోపణలు ఎదుర్కొంటూ అనేక వివాదాల్లో కేంద్రబిందువుగా రవికుమార్ ఉన్నారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయనపై నున్న కేసులు వెలుగులోకి వచ్చాయి.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. బుధవారం లొంగిపోయేందుకు కూడా తన పంథా వీడకుండా భారీగా టీడీపీ కార్యకర్తలతో ర్యాలీగా రావడం విశేషం. బుధవారం శ్రీకాకుళం జిల్లా పొందూరు పోలీస్ స్టేషన్ లో ఆయన లొంగిపోయారు. టీడీపీ కార్యకర్తలు, అనుచరులు భారీ ర్యాలీగా పీఎస్ కు తీసుకొచ్చి మరీ ఆయనను పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం బెయిల్ కోసం ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు.
శ్రీకాకుళం జిల్లా పొందూరు తహసీల్దార్ రామకృష్ణ కు టీడీపీ నేత, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ ఫోన్ చేసి బెదిరించడం ఏపీలో నాడు తీవ్ర కలకలం సృష్టించింది. కూన రవికుమార్ మట్టి టిప్పర్లను పట్టుకుని సీజ్ చేసిన తహసీల్లార్ ను బెదిరించాడు. దుర్భాషలాడాడు. లంచం ఇస్తా విడువు అని నానా మాటలన్నాడు. ఈ ఆడియో క్లిప్పింగ్స్ ను తహసీల్దార్ రామకృష్ణ బయటపెట్టడంతో ప్రభుత్వం షేక్ అయ్యింది. ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ ఆడియో టేప్ వైరల్ అయ్యింది.
తహసీల్దార్ ఫిర్యాదు మేరకు టీడీపీ మాజీ విప్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే కూన రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బుధవారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు.