Begin typing your search above and press return to search.
టీడీపీ విషయంలో రమణ తీవ్రంగా హర్టయ్యాడే
By: Tupaki Desk | 11 Jan 2018 4:28 AM GMTరాజకీయాల్లో అధికారం అనేది ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అధికారానికి దూరంగా ఉంటే...సహజంగానే పార్టీకి నేతలు దూరమవుతుంటారు. అందులోనూ ఒకటి కాదు రెండు కాదు...ఏకంగా పదిహేను సంవత్సరాలు పాలనకు పార్టీ దూరంగా ఉంటే...అందులోనూ భవిష్యత్తులో అవకాశాలు తక్కువగా కనిపిస్తుంటే...ఇక ఏ పార్టీపై అయినా ఆశలు సన్నగిల్లుతాయి. అదే సమయంలో సొంత పార్టీ నేతలకే నమ్మకం పోతుంది. సరిగ్గా ఇలాంటి పరిణామాలే టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణను హర్ట్ చేశాయి.
తీవ్రంగా బలహీనపడ్డ పార్టీని బలోపేతం చేయడం, 2019 ఎన్నికలే లక్ష్యంగా సిద్ధం చేయడంలో భాగంగా టీడీపీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎన్టీఆర్ భవన్ లో మూడవ బ్యాచ్ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ స్థానిక సంస్ధలకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి తిష్టవేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. మురళి అనే నిరుద్యోగి ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించడానికి వెళ్ళిన ఒంటేరు ప్రతాప్ రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించారని విమర్శించారు. ఇటువంటి విధానాలతో టీడీపీలో గందరగోళం సృష్టించాలన్న ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కార్యకర్తలెవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. టీఆర్ ఎస్ ను కూకటి వేళ్ళతో పెకిలించి వేద్దామని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో టీడీపీ లేదంటున్న వారికి గుణపాఠం చెప్పేలా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ ఈ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మాదిగ - మాల - మహిళలకు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం లేదని - నిరుద్యోగులకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. గత 22 సంవత్సరాలుగా ఎంఆర్ పిఎస్ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నా గత ప్రభుత్వాలు ఏ ఇబ్బంది పెట్టలేదని అన్నారు. కానీ ఈ ప్రభుత్వం మంద కృష్ణ మాదిగపై కేసు పెట్టి జైలుకు పంపించిందని ఆయన విమర్శించారు. టీఆర్ ఎస్ సర్కారుకు వ్యతిరేకంఆ పోరాడావలసిన సమయం వచ్చిందన్నారు.