Begin typing your search above and press return to search.
కవిత కోసమే మండవను పార్టీలో చేర్చుకుంటున్నారా.?
By: Tupaki Desk | 5 April 2019 4:56 PM GMTతెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేసినా దానికో లెక్క.. ఓ ముందు చూపు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అవతలి వారి ఎత్తుగడల్ని ముందే ఊహించి దాన్ని కట్టడి చేయడంలో కేసీఆర్ స్టైలే వేరు. ఈ విషయంలో ఇప్పటికి చాలా సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది కూడా. ఇప్పుడు అలాంటి సంఘటనే మరొకటి జరిగింది.
నిజామాబాద్ నుంచి కేసీఆర్ కుమార్తె కవిత రెండోసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి అనూహ్యంగా నిజామాబాద్ స్థానం నుంచి చాలామంది రైతులు నామినేషన్లు వేశారు. దీంతో.. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్న వారి సంఖ్య 180 దాటింది. అదీగాక.. నిజామాబాద్ లో కవితపై అలాగే టీఆర్ ఎస్ ప్రభుత్వంపై కూడా కాస్త వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతకు చెక్ పెట్టాలన్నా - తన కుమార్తె కవిత గెలవాలన్నా దానికి స్థానిక నాయకత్వం మద్దతు అవసరం. అందుకే టీడీపీ హయంలో మంత్రిగా పనిచేసి.. ఎలాంటి వివాదాలు లేని వ్యక్తిగా పేరు తెచ్చుకున్న మండవ వెంకటేశ్వరరావుని పార్టీలోకి తీసుకున్నారు కేసీఆర్. ఇవాళ.. హైదరాబాద్ లోని మండవ వెంకటేశ్వర రావు ఇంటికి వెళ్లారు. చాలాసేపు మాట్లాడారు. ఆ తర్వాత మండవని తీసుకుని ప్రగతి భవన్ వెళ్లారు కేసీఆర్.
సాధారణంగా టీఆర్ ఎస్ పార్టీలో చేరాలంటే ఎవ్వరైనా సరే టీఆర్ ఎస్ భవన్ కు రావాల్సింది. కానీ చాలా అతికొద్ది సందర్భాల్లోనే కేసీఆరే వెళ్లి స్వయంగా కొంతమంది లీడర్లను ఆహ్వానిస్తుంటారు. ఇప్పుడు మండవ కూడా ఈ కోవలోకే వస్తారు. మండవ వెంకటేశ్వరరావు నిజామాబాద్ లోని జుక్కల్ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. చంద్రబాబు ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు మండవని తమ పార్టీలోకి తీసుకురావడం వల్ల.. టీడీపీ ఓట్లు అన్నీ ఇప్పుడు టీఆర్ ఎస్ కు గంపగుత్తగా పడే అవకాశం ఉంది.