Begin typing your search above and press return to search.
ప్రతీకారం తీర్చుకుంటాం.. ఆ తెలుగు తమ్ముడి వీరావేశం
By: Tupaki Desk | 20 Nov 2021 4:51 AM GMTఏపీ అసెంబ్లీ లో చంద్రబాబు సతీమణి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రమైన ఆగ్రహాన్ని అంతకు మించిన భావోద్వేగానికి గురి కావటం తెలిసిందే. ఈ తీరును అధికార పక్షం తప్పు పడితే.. తెలుగు దేశం పార్టీ నేతలు తీవ్రంగా మండి పడుతున్నారు. ఈ సందర్భంగా వారు వీరావేశాన్ని ప్రదర్శిస్తున్నారు. అధినేత కు అండగా నిలుస్తున్నారు. రాబోయే రోజుల్లో అంత కంత మూల్యం తప్పదని తేల్చి చెబుతున్నారు.
వైసీపీ నేతల చర్యల్ని తీవ్రం గా తప్పు పట్టిన మాజీ మంత్రి.. టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ ఏపీ అధికార పక్షం పై తీవ్రంగా మండిపడ్డారు. ప్రతి వైసీపీ నేత కుప్పం గురించి మాట్లాడుతున్నారని.. మంత్రులు.. ఎమ్మెల్యేలు పోటీ పడి మరీ కుప్పంలో మూడు నెలలు ఉన్నారన్నారు. ఇందుకోసం ఓటుకు రూ.10వేలు చొప్పున ఇచ్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
సీఎం జగన్ మెప్పు కోసం అధికార పక్ష నేతలు పోటీ పడి మరీ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఆయన.. వైసీపీ నేతల కు గుణ పాఠం చెప్పే రోజులు దగ్గరకు వస్తాయని చెప్పారు. వైసీపీ నేతలు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా.. టీడీపీ నేతలు.. క్యాడర్ మానసిక స్థైర్యాన్ని కోల్పోరని.. వైసీపీ నేతల పై తప్పని సరిగా ప్రతీ కారం తీర్చుకుంటారన్నారు. చంద్రబాబు కంట కన్నీరు రాష్ట్రానికి అరిష్టమన్న ఆయన.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన నిజాలు బయటకు వస్తున్నాయన్నారు. వాటన్నింటి మీదా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఆలోచించాలని.. ప్రభుత్వ తీరును ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు.