Begin typing your search above and press return to search.
జేసీబీకి బ్రాండ్ అంబాసిడర్‌గా జగన్: నారా లోకేశ్ ఫైర్
By: Tupaki Desk | 22 Aug 2022 2:30 AM GMTటీడీపీ యువ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ మీడియా సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస పర్యటనకు వెళ్లిన ఆయన్ను అక్కడి పోలీసులు అడ్డుకోవడంతో తిరిగి విశాఖ చేరుకొని అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి అనుమతి లేదంటూ ఆయన మీడియాతో మాట్లాడుతుండగానే పోలీసులు అడ్డుకున్నారు. 151 నోటీసు ఇచ్చినందున ఈ మీడియా సమావేశానికి అనుమతి లేదని చెప్పారు.
పోలీసుల తీరుపై లోకేశ్, టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు, టీడీపీ నాయకులకు మధ్య వాగ్వా దం, తోపులాట చోటు చేసుకుంది. మీడియా సమావేశాన్ని అడ్డుకుని నారా లోకేశ్‌ను పోలీసు వ్యానులో విశాఖ విమానాశ్రయం తరలించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఈ రకమైన చర్యలు సమర్థనీయం కాదన్నారు. తాము శాంతిభద్రతల సమస్య సృష్టించట్లేదని, విశాఖకు గౌరవంగానే వచ్చాను గౌరవంగానే వెళ్తానని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కూల్చివేతల జగన్ నిరంకుశ పాలన సాగుతోందని లోకేశ్ నిప్పులు చెరిగారు. జగన్.. రాజారెడ్డి రాజ్యాంగం నడుపుతున్నారని, ప్రభుత్వాన్ని నిలదీస్తే అయ్యన్న ఇంటిని జేసీబీతో కూల్చారని, విశాఖ గీతం వర్సిటీ భూభూగంలోని ప్రహరీ గోడ కూల్చారని అన్నారు. నోటీసులు లేకుండా అర్ధరాత్రి వెళ్లి ప్రహరీ గోడ కూల్చారని, ప్రజల సమస్యలపై ప్రభుత్వంపై అనేక రకాలుగా పోరాడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం నుంచి సమాధానం రావట్లేదు నిలదీస్తే జేసీబీ వస్తోందని వ్యాఖ్యానించారు. జేసీబీకి బ్రాండ్ అంబాసిడర్‌గా జగన్ నిలుస్తున్నారని ఎద్దేవా చేశారు.
తన పర్యటన అడ్డుకోవటానికి పెట్టిన శ్రమ అభివృద్ధిపై పెట్టాలని నారా లోకేశ్ ప్రభుత్వానికి హితవు పలికారు. శాంతిభద్రతలు కాపాడటంపై శ్రద్ధ పెడితే పరిస్థితులు బాగుండేవని హితవు పలికారు. పలాసలో పార్టీ కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్తుంటే.. పోలీసులు అడ్డుకోవటం బాధాకరమన్నారు. కార్యకర్తలను కలవాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలా ? అని ప్రశ్నించారు. మంత్రి అప్పలరాజు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.