Begin typing your search above and press return to search.

లోకేష్ చుట్టూ 'యువ' రాజ‌కీయం... ఏం జ‌రుగుతోందంటే..!

By:  Tupaki Desk   |   6 Nov 2022 10:30 AM GMT
లోకేష్ చుట్టూ యువ రాజ‌కీయం... ఏం జ‌రుగుతోందంటే..!
X
టీడీపీ అధినేత ఒక్క చాన్స్ ఇస్తే చాలు త‌మ స‌త్తా చాటుతామ‌నే వారు చాలా మంది క‌నిపిస్తున్నారు. కానీ, చంద్ర‌బాబు మాత్రం ఈ విష‌యంలో ఎందు కో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వారే యువ నాయ‌కులు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది యువ నాయ‌కులు ఫైర్‌పై ఉన్నారు. వీరిలో యువ‌తులు కూడా ఉన్నారు. అయితే చంద్ర‌బాబు మాత్రం వీరిని ఎందుకో ఎంక‌రేజ్ చేయ‌డం లేద‌ని చెబుతున్నారు. మ‌రోవైపు.. లోకేష్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు టీంగా ఉన్న‌వారిలో మ‌రో గుబులు రేగింది. పార్టీలో ఇప్ప‌టి వ‌ర‌కు లోకేష్‌కు మంచి హ‌వా ఉంది.

పార్టీ ఓడిపోయినా, అటు శాస‌న మండ‌లిలోనూ ఇటు ప్ర‌జల‌మ‌ధ్య లోకేష్ దూకుడుగానే ఉన్నారు. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. స‌మ‌స్య ఎక్క ఉంటే అక్క‌డ‌కు వెళ్లిపోతున్నారు. అదేస‌మ‌యంలో తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు కూడా గుప్పిస్తున్నారు. అయితే, ఇన్నాళ్లుగా దూకుడు ప్ర‌ద‌ర్శి స్తున్న లోకేష్ గ‌త నెల రోజులుగా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నేది త‌మ్ముళ్ల టాక్‌. దీంతో ఏం జ‌రిగింద‌నే విష‌యంపై ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటు న్నారు. మ‌రోవైపు.. టీడీపీ జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకున్న ద‌రిమిలా.. ప‌వ‌న్ కోసం ఇలా లోకేష్‌ను కొంత సైడ్ చేస్తున్నారా? అనే చ‌ర్చ‌కూడా సాగుతోంది.

అయితే.. దీనిని సీనియ‌ర్ నేత‌లు త‌ప్పుబ‌డుతున్నారు. అలాంటిదేమీ లేదని.. ప‌వ‌న్ క‌లిసినా.. క‌ల‌వ‌క‌పోయినా.. లోకేష్ రాజ‌కీయానికి ఎవ‌రూ అడ్డు ప‌డ‌ర‌ని అంటున్నారు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు లోకేష్ వ‌ర్గంగా ఉన్న‌వారు ఇప్పుడుసైలెంట్ అయ్యారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌న‌తో హుషారుగా తిరిగిన వారు ఇప్ప‌డుఉ సైలెంట్ అయ్యారు. అదే స‌మ‌యంలో ఇంత‌కుముందు త‌మ‌కు ఏదైనా చేస్తారు.. టికెట్ ఇప్పిస్తారు.. అని ఆశ‌లు పెట్టుకున్న వారు లోకేష్ చుట్టూ తిరిగేవారు. వీరిలో వార‌సులు కూడా ఉన్నారు.

అయితే, కొన్నాళ్లుగా ఇది కూడా క‌నిపించ‌డం లేదు. లోకేష్ చుట్టూ తిరిగే వారు కూడా మౌనంగా ఉంటున్నారు. దీంతో అస‌లు ఏం జ‌రుగుతోంది? లోకేష్ హ‌వా ఎందుకు త‌గ్గింది? ఇది ఇలానే కంటిన్యూ అవుతుందా? లేక‌.. ఏం జ‌రుగుతుంది? అనే చ‌ర్చ జోరుగానే సాగుతోంది. కానీ, దీనిపై స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. మ‌రోవైపు ఆయ‌న పాద‌యాత్ర విష‌యంలోనూ ఇప్ప‌టి వ‌ర‌కు స్ప‌ష్ట‌త లేదు. చేస్తారా? చేయ‌రా? అన‌ది కూడా చెప్ప‌డం లేదు. దీని వెనుక‌ కూడా ఏదో రీజ‌న్ ఉంద‌నే అభిప్రాయం త‌మ్ముళ్ల‌లో వ్య‌క్త‌మ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.