Begin typing your search above and press return to search.
టీడీపీ నేత పట్టాభి అరెస్ట్
By: Tupaki Desk | 21 Oct 2021 2:44 AM GMTటీడీపీ నేత పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం జగన్‌పై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో పట్టాభిపై కేసులు నమోదు చేశారు. పట్టాభిపై 120బీ, 505,504 సహా అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తన భర్తకు ఎలాంటి హాని జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని పట్టాభి సతీమణి చంద్ర అన్నారు. తనకు పోలీసులపై నమ్మకం లేదని చెప్పారు. తలుపులు బద్దలుగొట్టి మరీ ఇంట్లోకి రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్ కాపీ కూడా చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెక్షన్ 120 బి కింద పట్టాభిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పారని ఆమె పేర్కొన్నారు. తమ ఇంటిపై దాడి చేసిన వారిని ఇంతవరకూ అరెస్ట్ చేయలేదని తెలిపారు. పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేస్తారని పనిగట్టిన టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటి వద్దకు భారీ చేరుకున్నారు. మీడియా, కార్యకర్తలను బలవంతంగా పోలీసులు బయటికి పంపించి పట్టాభిని అరెస్ట్ చేశారు. పట్టాభి అరెస్ట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు ఖండించారు.
అరెస్ట్‌కు ముందు పట్టాభి ఓ వీడియో సందేశం ఇచ్చారు. తనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆ వీడియోలో తెలిపారు. పోలీసు కస్టడీలో తనకు ప్రాణహాని ఉందని పట్టాభి ఆందోళన వ్యక్తం చేశారు. తన ఒంటిపై ప్రస్తుతం ఎలాంటి గాయాలు లేవని వీడియోలు చూపించారు. తనకు ఎలాంటి ప్రాణహాని జరిగినా పోలీసులదే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని కోర్టుపై తనకు నమ్మకం ఉందని పట్టాభి తెలిపారు. ప్రస్తుతం పట్టాభి ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టాభి నివాసంలోని సీసీ ఫుటేజ్, హార్డ్ డిస్క్, డీవీఆర్‌ను పోలీసులు స్వాదీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పట్టాభి ఇంటి వద్దకు టీడీపీ శ్రేణులు చేరుకుంటున్నాయి.