Begin typing your search above and press return to search.
నన్ను చంపేయండి: పట్టాభి
By: Tupaki Desk | 20 Oct 2021 2:45 AM GMT‘నేను చనిపోవడానికి కూడా సిద్దం... నన్ను చంపేయండి’అని టీడీపీ నేత పట్టాభి సవాల్ విసిరారు. తనను ఎప్పుడు చంపాలా అని ఎదురు చూస్తున్నారని తెలిపారు. తన నివాసంపై జరిగిన దాడి ఘటనపై ఆయన స్పందించారు. ఇంత మంది పోలీసులు ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. తన భార్య, బిడ్డలు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వ లోపాలని ప్రశ్నిస్తే చంపేస్తారా అని నిలదీశారు. ఇంటిపై దాడి జరిగిందని పట్టాభికి భార్య, కూతురు ఫోన్ చేసి చెప్పారు. పట్టాభి నివాసంపై దాదాపు 50 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అంతేకాదు విలువైన వస్తువులను కూడా ధ్వంసం చేశారని తెలిపారు. వైసీపీ నేతలే దాడికి పాల్పడ్డారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి..
పట్టాభి నివాసంపై దాడి నేపథ్యంలో ఆయన ఇంటికి పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు టీడీపీ నేతులు పరిశీలించారు. మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధాకృష్ణ, బోడే ప్రసాద్ ఈ ఘటన పై ప్రత్యక్ష సాక్షులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులను చంద్రబాబు ఖండించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఎం జగన్‌కు తెలిసే టీడీపీ కార్యాలయాలపై దాడి జరిగిందని చంద్రబాబు ఆరోపించారు.
టీడీపీ కార్యాలయం, నేతల ఇళ్లపై దాడులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు ఎవరికీ క్షేమం కాదని హితవుపలికారు. ఇటువంటి దాడులు అరాచకానికి, దౌర్జన్యానికి దారి తీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకేసారి పలు ప్రాంతాలలో దాడి అంటే.. ఉద్దేశపూర్వకంగా చేసిందేనని పవన్ ఆరోపించారు.