Begin typing your search above and press return to search.

జిల్లాలో టీడీపీకి పెద్ద దెబ్బే

By:  Tupaki Desk   |   20 Nov 2020 11:50 AM GMT
జిల్లాలో టీడీపీకి పెద్ద దెబ్బే
X
చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో పార్టీ గట్టి మద్దతుదారుని కోల్పోయింది. గురువారం మాజీ ఎంఎల్ ఏ డీఏ సత్యప్రభ మరణించారు. డీఏ సత్యప్రభ అంటే జిల్లాలో ఎవరికీ పరిచయం అవసరం లేదు. ఎందుకంటే మాజీ ఎంపి - టీటీడీ ట్రస్టుబోర్డు మాజీ ఛైర్మన్ డీకే ఆదికేశవుల నాయుడు సతీమణి. డీకే మరణం తర్వాత సత్యప్రభ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ తరపున పోటీ చేసి చిత్తూరు ఎంఎల్ ఏగా గెలిచారు.

డీకే ఆదికేశవులంటే జిల్లా నుండి ఢిల్లీ వరకు తెలీని రాజకీయ పార్టీ ఉండదు. ఎందుకంటే డీకే అంతటి ప్రముఖ పారిశ్రామికవేత్త. జిల్లాలోని అన్నీ పార్టీలతోను అత్యంత సన్నిహితంగా ఉండేవారు. సత్యప్రభ కూడా అన్నీ పార్టీలతోను సన్నిహిత సంబంధాలు మైన్ టెయిన్ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో రాజంపేట టీడీపీ ఎంపిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుండి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

చంద్రబాబు మీద అసంతృప్తితో మాజీ ఎంఎల్ ఏ తొందరలోనే టీడీపీకీ రాజీనామా చేసి వైసీపీలో చేరుతారనే ప్రచారం బాగా జోరుమీదుంది. దీనికి తగ్గట్లే ఈమధ్య జగన్ మోహన్ రెడ్డి తిరుమలకు వచ్చినపుడు సత్యప్రభ కొడుకు డీకే శ్రీనివాస్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాంతో ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. అయితే ఆమెను ఇటీవలే చంద్రబాబు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించారు.

డీకే కుటుంబం మొదటి నుండి ఇటు రాజకీయాల్లోనే కాకుండా అటు సామాజికవర్గంలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. రాయలసీమలోనే అత్యధి జనాభా ఉన్న బలిజ సామాజికవర్గంలో డీకే కుటుంబంకు మంచి ప్రాధాన్యతే ఉంది. జిల్లాలో ఎప్పుడు సామాజికవర్గ సమావేశాలు జరగాలన్నా అది డీకే కుటుంబం చేతల మీదగానే జరుగుతుంది. ఆర్ధికంగా - రాజకీయంగా - సామాజికవర్గంగా కూడా పటిష్టమైన స్ధితిలో ఉన్న సత్యప్రభ కరోనా వైరస్ కారణంగా చనిపోవటం టీడీపీకి పెద్ద దెబ్బనే చెప్పుకోవాలి.