Begin typing your search above and press return to search.
టీడీపీలో ఉన్నా ఇంట్లో వైఎస్సార్ ఫొటోనే..
By: Tupaki Desk | 13 Jun 2017 10:56 AM GMTనంద్యాల రాజకీయం రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. నంద్యాల టీడీపీలో ఉన్న సీనియర్ నేత శిల్పా మోహనరెడ్డి అక్కడి ఉప ఎన్నికల్లో టిక్కెట్ అడుగుతున్న విషయమూ తెలిసిందే. చంద్రబాబు నిరాకరించడంతో ఆయన కొన్నాల్లుగా వైసీపీ వైపు చూస్తున్నారు. తాజాగా ఆయన వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన విషయం ఒకటి చెప్పారు. తాను టీడీపీలో ఉన్నా కూడా తన ఇంట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటో మాత్రమే ఉంటుందని ఆయన అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన రాజకీయ గురువు అని అన్నారు.
వైఎస్ ఆర్ సీపీ సిద్ధాంతాలు - జగన్ పనితీరు తనను ఆకర్షించాయన్నారు.. టీడీపీలో ఉండటం వల్ల కార్యకర్తలు నలిగిపోయారని, నంద్యాల టీడీపీలో మూడు గ్రూపులయ్యాయని శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. తమ కార్యకర్తలపై చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, పార్టీని వీడాలని కార్యకర్తలంతా తనపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు. భూమా నాగిరెడ్డి టీడీపీలోకి వచ్చాక విభేదాలు మరింత పెరిగాయని... అంతేకాకుండా తన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు.
కార్యకర్తల నిర్ణయం మేరకే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు శిల్పా మోహన్ రెడ్డి స్పష‍్టం చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. పార్టీ మారినవారు గెలిచే పరిస్థితి కనిపించడం లేదన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనే కాదని, ప్రజల వ్యతిరేకతను చవిచూస్తున్నారని చెప్పారు. తాను అధికారంలో ఉన్న పార్టీ నుంచి విపక్షంలోకి వెళ్తున్నానని.. తాను పవర్ పాలిటిక్సుకు దూరమని చెప్పుకొచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/