Begin typing your search above and press return to search.
లంక ఉగ్రబాధితుల్లో టీడీపీ నేత
By: Tupaki Desk | 22 April 2019 5:09 AM GMTశ్రీలంకలో నిన్న జరిగిన బాంబు పేలుళ్లు యావత్ ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేశాయి. ఇందులో 215మంది మృతి చెందగా.. వందలాది మంది గాయపడ్డారు. మన దేశానికి చెందిన వారు కూడా ఇందులో ఉన్నారు. 11మంది భారతీయులు చనిపోయారని సమాచారం.
ఇక శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడిలో టీడీపీ నేత కూడా గాయపడినట్లు ఆలస్యంగా వార్త వెలుగులోకి వచ్చింది. నలుగురు మిత్రులతో కలిసి శ్రీలంకకు టూర్ వెళ్లిన అనంతపురానికి చెందిన టీడీపీ నేత - ఎస్ ఆర్ కన్ స్ట్రక్షన్ అధినేత అమిలినేని సురేంద్రబాబు ఈ దాడుల్లో గాయపడినట్లు సమాచారం. శ్రీలంకలోని ప్రఖ్యాత షాంగ్రీలా హోటల్ లో ఈయన బస చేశారు. హోటల్ లో టిఫిన్ చేస్తుండగా ఉగ్రవాది బాంబు పేల్చుకున్నాడు. అనంతరం కలకలం చెలరేగి అందరూ పారిపోతుండగా.. సురేంద్రబాబు కూడా పరిగెత్తారు. అప్పుడు తొక్కిసలాట జరిగి ఈయన గాయపడ్డారు. తర్వాత తేరుకొని ఎమర్జెన్సీ గేటు నుంచి బయటకు వచ్చారు. ఈరోజు బంధువులకు క్షేమ సమాచారం అందించడంతో వార్త బయటకు వచ్చింది.
కాగా సురేంద్రబాబు పాస్ పోర్ట్ - లగేజ్ హోటల్ గదిలో ఉండడంతో అక్కడే చిక్కుకుపోయారు. హోటల్ సీజ్ చేయడంతో ఆయన పాస్ పోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. కాగా ఈ దాడి జరగడానికి కొద్ది నిమిషాల ముందే ప్రముఖ తమిళ నటి రాధిక ఇదే హోటల్ గదిని ఖాళీ చేయడంతో ఆమెకు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.