Begin typing your search above and press return to search.
ఏమైంది వర్ల.. అలా మాట్లాడేశావేంది?
By: Tupaki Desk | 10 May 2018 4:24 PM GMTటీడీపీ నేతల తీరు మహా చిత్రంగా ఉంటుంది. రాజకీయ నాయకుడు అంటే ప్రజాసేవకుడిగా చెబుతారు. కానీ.. టీడీపీ లీడర్లలో మాత్రం అంతులేని అహంకారం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మామూలుగానే నోటికి పని చెప్పే టీడీపీ నేతలకు.. అధికారం చేతిలో ఉంటే ఎంతలా చెలరేగిపోతారనటానికి తాజా ఉదంతం ఒక నిదర్శనంగా చెప్పక తప్పదు.
వర్ల రామయ్య తెలుసుగా. రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేయటం కంటే కూడా టీవీ చర్చల్లో గంటల కొద్దీ మాటలు చెప్పేస్తాడే.. ఆయనకు ఈ మధ్యన ఆర్టీసీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు చంద్రబాబు. ఇంకేముంది.. తన సత్తా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పదవి ఇచ్చేది పని చేయటానికే కాబట్టి.. పనికి బదులు కాస్త హడావుడి చేసినా సర్దుకోవచ్చు. ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నార్లేనని సరిపెట్టుకోవచ్చు.
కానీ.. అందుకు భిన్నంగా తన తీరుతో కొత్త వివాదాల్ని నెత్తిన వేసుకోవటం ఏమిటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు వర్ల రామయ్యను. తాజాగా ఆయన నోటి దూకుడుకి షాకయ్యే పరిస్థితి. కృష్ణా జిల్లా మచిలీపట్నం బస్టాండ్లో తనిఖీ నిమిత్తం ఆయన చేసిన వ్యాఖ్యలు.. వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేం తీరు అంటూ పలువురు తప్పు పట్టే పరిస్థితి.
బస్టాండ్ తనిఖీ చేసేందుకు వచ్చిన వర్ల రామయ్య.. మంది మార్బలాన్ని వెంట వేసుకొని తిరిగారు. ఆయన అలా నడుస్తున్నప్పుడు అందరూ ఆయన వంక చూడాలనుకున్నారేమో కానీ.. బస్సులో కూర్చున్న ఒక కుర్రాడు ఎంచక్కా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏదో వింటున్నాడు. తన వంక కనీసం చూడని కుర్రాడి తీరు వర్లకు కోపం వచ్చినట్లుంది. ఇంత హడావుడి ఇక్కడ జరుగుతుంటే వీడు ఈ లోకంలోనే లేడు.. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉండిపోయాడంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
తాను వస్తుంటే అందరూ చూడాలి.. అలెర్ట్ గా ఉండాలన్న రాజరికపు పోకడలు గుర్తుకొచ్చేలా మాట్లాడిన వర్ల రామయ్య.. ఆ కుర్రాడి కులాన్ని తనదైన శైలిలో రఫ్ గా అడిగేశాడు. నువ్వు.. ఎస్సీనా.. ఎస్టీనా అనేసి.. మాదిగా.. మాలా.. అన్న మాటకు మాదిగ అన్న సమాధానాన్ని కుర్రాడి నోటి నుంచి వచ్చినంతనే రాయలేని మాటను.. వాడేసి చదవడంటూ సర్టిఫికేట్ ఇచ్చేసిన వైనం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.
అక్కడితో ఆగని ఆయన.. పలు వ్యాఖ్యలు చేయటం.. చిన్న కుర్రాడికి ఫోన్ ఇస్తారా? అంటూ తల్లిదండ్రులకు మెసేజ్ ఇచ్చేలా పెద్ద పెద్ద మాటలు అనేసిన వర్ల తన దారిన తాను వెళ్లారు. ఈ ఎపిసోడ్ చూసినోళ్ల నోట మాట రాని పరిస్థితి. వర్ల ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు అంతలా విరుచుకుపడుతున్నారో తమకు అర్థం కావటం లేదని అక్కడున్న సిబ్బంది కొందరు గొణుక్కోవటం చూస్తే.. వర్ల వారి హడావుడి ఏ రేంజ్లో సాగిందో అర్థమవుతుంది. నాయకుడిగా ఉన్న పెద్దరికాన్ని కాపాడుకోవాలే కానీ.. దాన్ని తప్పు పట్టేలా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందన్నది గుర్తిస్తే మంచిది. పదవి వచ్చినప్పుడు దాన్ని ఎంత సమర్థంగా నిర్వహిస్తే అంత బాగుంటుంది కానీ.. ఇలా నోరు పారేసుకుంటే ఏం బాగుంటుంది వర్ల సార్?
వీడియో చూడటానికి క్లిక్ చేయండి