Begin typing your search above and press return to search.

వైసీపీ మునిగే నావ....జగన్ సొంత జిల్లా నుంచే వీరావేశం

By:  Tupaki Desk   |   23 Jan 2023 2:30 AM GMT
వైసీపీ మునిగే  నావ....జగన్ సొంత జిల్లా నుంచే వీరావేశం
X
వైసీపీ పని అయిపోయింది అని చంద్రబాబు తరచూ అంటున్నారు. ఆయన తన జిల్లా టూర్లలో ఇదే మాటను పదే పదే చెబుతూ వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అని అంటున్నారు. అయితే తెలుగుదేశం అధినాయకుడు చెప్పడం వేరు, వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ గా ఉన్న రాయలసీమ నుంచే ఆ మాట వినిపించడం వేరు అన్నది తెలిసిందే. ప్రత్యేకించి జగన్ సొంత జిల్లా నుంచే ఈసారి వైసీపీ ఓటమి ఖాయం. అది మామూలుగా ఉండదు భారీ పరాజయం అని అంటూంటే ఆసక్తి ఇంకా బాగా పెరుగుతోంది.

వైసీపీ పార్టీగా పుట్టాక రాయలసీమలో భారీ ఆధిక్యతను కొనసాగిస్తోంది. అదే టైం లో కడప జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని చూపిస్తోంద్ల్. అలాంటి కడప జిల్లాలో ఈసారి తెలుగుదేశం ఊపు కనిపిస్తుందని అంటున్నారు. మాజీ మంత్రి వీరశివారెడ్డి వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదు అనేస్తున్నారు. ఆ పార్టీ పని అయిపోయింది అని ఆయన కుండబద్దలు కొడుతున్నారు. మునిగే నావను ఎవరు ఎక్కరని ఆయన హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంతకీ ఎవరీ వీరశివారెడ్డి ఈయనకు ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి అంటే అక్కడే ఉంది కధ. వీరశివారెడ్డి వైఎస్సార్ శిష్యుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా ఆయన పలుమార్లు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలలో తిరుగుతూ వస్తున్నారు. అయినా పలు మార్లు గెలవడం ఆయన ప్రత్యేకత. ఇక ఆయన విక్టరీ హిస్టరీ చూస్తే 1994లో నాటి హోం మంత్రి మైసూరారెడ్డినే ఓడించి తెలుగుదేశం జెండా పాతారు. వీరశివారెడ్డికి కమలాపురం నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది.

ఆయనకు పెద్ద ఎత్తున అనుచర గణం ఉంది. ఆయన 2014నాటికి తెలుగుదేశంలో చేరినా 2019లో మాత్రం వైసీపీకి మద్దతు ఇచ్చారు. ఆ విధంగా అక్కడ జగన్ మేనమామ రవీంద్రారెడ్డి రెండవసారి గెలిచారు. అయితే ఇపుడు అదే వీరశివారెడ్డి జగన్ సర్కార్ మీద ద్వజమెత్తుతున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా దక్కకపోవడంతో మళ్లీ తెలుగుదేశం గూటికే చేరుతున్నారు. తనతో పాటు మరో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి కూడా తెలుగుదేశంలో చేరుతారు అని ఆయన తాజాగా ప్రకటించారు.

గెలుపు గుర్రాలకే చంద్రబాబు టికెట్లు ఇస్తారని, అలాగే సీనియర్లకు పెద్ద పీట వేస్తున్నారు అని వీరశివారెడ్డి చెప్పుకొచ్చారు. తాను కమలాపురం నుంచి పోటీ చేయడం ఖాయమని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక రెండు సార్లు గెలిచినా ప్రజలకు పెద్దగా పనులు చేయని ఎమ్మెల్యేగా ఉన్న రవీంద్రారెడ్డిని ఈసారి జనం ఓడిస్తారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే మైదుకూరులో సైతం డీఎల్ రవీంద్రారెడ్డి జగన్ వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. ఈ నాయకుడు కూడా వైసీపీ విజయం కోసం పాటు పడితే ఆయనకు ఏ రకమైన పదవీ లేకుండా వైసీపీ చిన్నబుచ్చింది అన్న ఆగ్రహం ఉంది.

ఈ ఇద్దరుతో పాటు రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మేడ మల్లికార్జున రెడ్డి చూపు కూడా తెలుగుదేశం మీద ఉంది అంటున్నారు. ఆయన 2014లో రాజంపేట నుంచి టీడీపీ తరఫున గెలిచి ఆ పార్టీకి బోణీ కొట్టారు. ఆయన వైసీపీ నుంచి మంత్రి పదవి ఆశించారు. కానీ దక్కలేదు. దాంతో పాటు ఆయన వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు బేరీజు వేసుకున్న తరువాతనే పార్టీ మారాలని డిసైడ్ అవుతున్నారు అని అంటున్నారు.

మొత్తానికి చూస్తే ఈ మూడు నియోజకవర్గాలు ఈసారి వైసీపీకి అగ్ని పరీక్షగా మారోబోతున్నాయని అంటున్నారు. 2019లో పదికి పది సీట్లు సాధించిన వైసీపీకి ఇపుడు కష్టకాలమే అంటున్నారు. జగన్ సొంత జిల్లాలోనే టీడీపీకి అనుకూల పవనాలు వీస్తే కనుక ఏపీలో సీన్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నారు. మరి చూడాలి ఏమి జరుగుతుందో.