Begin typing your search above and press return to search.

మా బాబు పదేళ్ళ సీఎం... తమ్ముళ్ళ ప్రచారం స్టార్ట్

By:  Tupaki Desk   |   7 Dec 2022 1:30 AM GMT
మా బాబు పదేళ్ళ సీఎం... తమ్ముళ్ళ ప్రచారం స్టార్ట్
X
వచ్చేవి అయిదేళ్ళ పాలనకు ఎన్నికలు. 2024లో ఎన్నికలకు కూడా ఇంకా ఏణ్ణర్ధం సమయం ఉంది. మరో వైపు చూస్తే ఏ క్షణాన ఎన్నికలు అయినా మేము సిద్ధం అని టీడీపీ చెప్పుకుంటోంది. చంద్రబాబు అయితే తన సభలలో తనకు ఒకటికి రెండు చాన్సులు ఇవ్వాల్సిందే అంటూ ప్రచారం చేస్తున్నారు. ఏపీని గాడిన పెట్టాలి అంటే పదేళ్ళ సమయం కచ్చితంగా పడుతుంది అని బాబు జనాలకు చెపుతున్నారు.

ఇపుడు తమ్ముళ్ళు కూడా అదే టోన్ లో మాట్లాడుతున్నారు. చంద్రబాబు వంటి విజనరీ ఉంటే ఏపీ అభివృద్ధి సాధ్యపడుతుందని వారు చెబుతున్నారు. ఢిల్లీలో జీ 20 సదస్సు జరిగితే చంద్రబాబు చేసిన ప్రసంగం హైలెట్ అయిందని, మరో పాతికేళ్ళలో దేశం డిజిటల్ ఇండియాగా ఎలా మార్చాలి అన్నది బాబు ప్రజెంట్ చేసిన తీరు దేశానికే ఆదర్శం అని వారు కొనియాడుతున్నారు.

బాబు విలువైన సూచనలు మోడీ వంటి వారు పరిగణనలోకి తీసుకుంటే భారత దేశం అగ్ర స్థానంలో ఉంటుందని కూడా చెబుతున్నారు. ఢిల్లీలో బాబు స్పీచ్ హైలెట్ అని ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆకాశానికెత్తేశారు. జీ 20 సదస్సులో బాబు ఇచ్చిన సూచనలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతున్నాయని ఆయన అన్నారు.

బాబు విలువ ఏంటో ఏపీ ప్రజలు తెలుసుకున్నారని 2024 కాదు 2029లో కూడా టీడీపీ గెలుస్తుందని, చంద్రబాబే పదేళ్ల పాటు ఏపీకి సీఎం గా ఉంటారని ఆయన జోస్యం చెప్పేశారు. బాబు పదేళ్ళు ఉంటే చాలు ఏపీ ఢిల్లీని తలదన్నే విధంగా అద్భుతమైన స్టేట్ గా మారుతుంది అని గొట్టిపాటి చెబుతున్నారు.

బాబు దార్శనికత ఈ టైం లో ఏపీకి అవసరం అని ఆయన అంటున్నారు. ఆయన ఒక్కరే కాదు టీడీపీకి చెందిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు, కీలక నేతలు కూడా వైసీపీ అయిదేళ్లలో చేసిన విద్వంశాన్ని సరిచేయాలీ అంటే ఏకపక్షంగా బాబుకే పదేళ్ళ అధికారం వదిలేయాల్సిందే అని అంటున్నారు. ఏపీ బాగుపడాలని కోరుకునే వారంతా ఆ దిశగా ఆలోచన చేయాలని పార్టీలను వర్గాలను ఇతర భేదాలను మరచి అంతా ఒక్కటిగా నిలిచి బాబుని సీఎం ని చేయాలని పిలుపు ఇస్తున్నారు.

అంటే వైసీపీ ఈసారి ఎన్నికల్లో బాబు విజన్ ని ఆయన చేసిన అభివృద్ధిని మరోసారి ప్రచారాస్త్రాలుగా చేసుకుంటోంది అని అంటున్నారు. చంద్రబాబు వంటి లీడర్ ఉంటేనే ఏపీకి భవిష్యత్తు అని ఈ విషయంలో ఎవరికి వారు వ్యక్తిగత అభిమానాలు విడనాడి ఏపీ అన్న ఏకైక కాన్సెప్ట్ తో ముందుకు సాగాలని అంటున్నారు. ఇప్పటికే ఈ నినాదం విద్యావంతులు, తటస్థులు, పట్టణ ప్రాంత ప్రజలు, ఉన్నత, మధ్యతరగతి ప్రజలలో విపరీతమైన చర్చకు తావిస్తోంది. అయితే రూరల్ సెక్టార్ తో పాటు అల్పాదాయ వర్గాలలోకి ఈ నినాదం కనుక చొచ్చుకుపోతే యునానిమస్ గా టీడీపీకి విజయం వరించి వస్తుందని అంటున్నారు.

ఇక చంద్రబాబు ఒక్కసారి సీఎం అయ్యారు అంటే కనుక కచ్చితంగా పదేళ్ళ పాటు సీటు దిగే సమస్యే లేదని కూడా తమ్ముళ్ళు కడు నమ్మకంగా చెబుతున్నారు. అంటే ఏపీలో విపక్షం లేకుండానే తెలుగుదేశం పాలన సాగుతుందని, ఇక వైసీపీకి చెల్లు చీటి రాసేసినట్లే అంటున్నారు. స్ట్రాటజీ బాగుంది. దానికి తగినట్లుగా జనాల్లో రెస్పాన్స్ ఉంది. చిక్కల్లా రూరల్ సెక్టార్ తోనే. మరి వారు పధకాల బాటను వీడి ప్రగతి బాటన పడితే మాత్రం టీడీపీ కోరుకున్నట్లుగా 150 సీట్లతో పాటు పదేళ్ళ సీఎం గా బాబు ఉంటారని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.