Begin typing your search above and press return to search.
ఇప్పుడు విజయమ్మ ఎక్కడున్నారు?
By: Tupaki Desk | 11 Feb 2016 6:03 PM GMTదివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి.. విజయమ్మ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసింది. తాజాగా ఏపీ తెలుగుదేశం నేతలు చేసిన ఒక వ్యాఖ్య కూడా తాజా చర్చకు కారణంగా చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న విజయమ్మ.. కొడుకు జగన్ వద్ద ఉండటం లేదన్న తెలుగుతమ్ముళ్ల ఆరోపణ.
తాము చేస్తున్న ఆరోపణకు బలం చేకూర్చే వాదన ఒకటి చేస్తున్నారు. అదేమంటే.. జగన్ మైండ్ సెట్ ను తట్టుకోలేక కొడుకు దగ్గర నుంచి బెంగళూరులోని కూతురు షర్మిల వద్దకు వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఈ వాదనపై టీడీపీ నేతల్లోనూ భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయంగా జగన్ పై ఎన్ని విమర్శలు చేసినా బాగానే ఉంటుందే కానీ.. వ్యక్తిగత అంశాల జోలికి వెళ్లటం ఏ మాత్రం సరికాదన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి ఆరోపణల కారణంగా జగన్ ఇమేజ్ ఎంత డ్యామేజ్ అవుతుందో కానీ.. పార్టీ పరపతి మాత్రం తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాజకీయంగా ఎవరెన్ని విమర్శలు చేసినా లెక్కలోకి రాదు కానీ.. నిజమో.. అబద్ధమో తెలియని అంశాల మీద తొందరపడి ఒక మాట అనేయటం సరికాదని చెబుతున్నారు. తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన అనంతపురం జిల్లా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ విమర్శల్ని కొందరు తమ్ముళ్లు తప్పు పట్టటం గమనార్హం.