Begin typing your search above and press return to search.
బాబు విషయం మర్చిపోవడంతో తమ్ముళ్లు హర్ట్
By: Tupaki Desk | 20 Jan 2017 12:08 PM GMTతెలుగుదేశం పార్టీ అధినేత - ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తెలుగు తమ్ముళ్లలో అసంతృప్తి రాజుకుంటోందని అంటున్నారు. ఏపీ మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఊరించి వివిధ రూపాల్లో లీకులు ఇచ్చిన పార్టీ అధినేత ఇపుడు ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదనేది తమ్ముళ్ల ఆగ్రహానికి ప్రధాన కారణం. ఏపీ కేబినెట్ విస్తరణ ఎప్పుడు? ఆశావహులంతా ఇప్పుడు దానికోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రేపో మాపో అని ప్రచారం రాగానే లాబీయింగ్ మొదలుపెడుతున్నారు. లేదనే సరికి ఉసూరుమంటూ అసంతృప్తితో రగిలిపోతున్నారు.
విభజిత ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు పూర్తి కావస్తోంది. చంద్రబాబుతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు మినహా.. మిగతా సీనియర్ నేతలెవ్వరికీ ఇప్పటికీ చోటు దక్కలేదు. ప్రారంభంలోనే విస్తరణ ఉంటుందని చెప్పినా అదిగో.. ఇదిగో అంటూ వాయిదా పడుతూనే ఉంది. ప్రస్తుతమున్న కేబినెట్ తో ఎన్నికలకు వెళ్తే కష్టమనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మంత్రుల్లో సపోర్టివ్ హ్యాండ్ లేకపోవడంతో చంద్రబాబే అన్నీతానై చూసుకుంటున్నారన్న చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో కేబినెట్ విస్తరణ జరిగితే బాగుంటుందని ఇంకా ఆలస్యం చేస్తే ప్రయోజనం ఉండదని కొందరంటున్నారు. మరోవైపు విస్తరణ ప్రచారం జరిగినప్పుడల్లా లోకేష్ కేబినెట్లోకి వచ్చేస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగేది. మిగతావారి మాటెలా ఉన్నా.. ఆయనకు ఫలానా శాఖ కేటాయించవచ్చని గుసగుసలాడుకున్నారు. విస్తరణ కొలిక్కి రాకుంటే పార్టీలో గందరగోళానికి తెరలేపినట్టు అవుతుందని కొందరు అంటున్నారు. అటు వలస వచ్చిన వారి వ్యవహారం కక్కా మింగలేని విధంగా ఉంది. ఆశించి వస్తే ఆశాభంగం ఎదురైందని సన్నిహితుల దగ్గర కొందరు వాపోతున్నట్టు సమాచారం. ఇలాంటి సమయంలో వీలైనంత త్వరగా మంత్రి వర్గ విస్తరణ చేపడితే బాగుంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. తాజాగా పార్టీలో అలాంటి సందడేమీ లేకపోవడంతో ఆశవాహులు ఎదురుచూపుల్లో మునిగిపోయారు.
ముఖ్యంగా మంత్రి పదవులపై ఆశతో పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో ఈ టెన్షన్ ఇంకా పెరిగిపోయిందని అంటున్నారు. బుగ్గకారు వచ్చేస్తుందని పార్టీ మారితే మూడు నెలలు ఆరునెలలకోమారు లీకులు ఇవ్వడం - ఆనక గమ్మున ఉండిపోవడంతో పదవి వచ్చేస్తుందని ఆశపడ్డ వారికి భంగపాటు తప్పడం లేదని అంటున్నారు. ఇంతకీ ఇంత కీలకమైన విషయాన్ని చంద్రబాబు ఎందుకు మర్చిపోయి ఉంటారని తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/