Begin typing your search above and press return to search.
సీన్ రివర్స్..నిమ్మగడ్డ పై మండిపోతున్న టీడీపీ
By: Tupaki Desk | 16 Feb 2021 1:38 PM GMTస్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం చివరకు అడకత్తెరలో పోకచెక్క లాగైపోయిందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకాలం నిమ్మగడ్డపై అధికార వైసీపీ కారాలు మిరియాలు నూరిన విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల నోటిపికేషన్ తర్వాత ఇపుడాపనిని టీడీపీ చేస్తోంది. తాజాగా జారీ అయిన నోటిఫికేషన్ అన్నీ విధాల వైసీపీకే అనుకూలంగా ఉంటుందని టీడీపీ మండిపోతోంది.
నోటిషికేషన్లో టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అంశాలు కొన్నున్నాయి. అవేమిటంటే గతంలో వాయిదపడినపుడు ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిపోయిందో తాజా నోటీఫికేషన్ ప్రకారం ప్రక్రియ అక్కడే నుండే మొదలవుతుంది. దీన్ని టీడీపీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. అప్పటి ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దుచేసి మళ్ళీ ప్రక్రియ మొత్తాన్ని ఫ్రెష్ గా మొదలుపెట్టాలని చేస్తున్న డిమాండ్ ను నిమ్మగడ్డ పట్టించుకోలేదు.
అలాగే మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలవరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇచ్చారు. దీన్ని కూడా టీడీపీ తప్పు పడుతోంది. నామినేషన్ల విత్ డ్రాయల్ కు మూడు వారాల గడువు ఇవ్వటం ఏమిటంటే తమ్ముళ్ళు నిమ్మగడ్డపై మండిపోతున్నారు. నామినేషన్లు వేసిన ప్రత్యర్ధి పార్టీల అభ్యర్ధులను లోబరుచుకునేందుకు వైసీపీకి మూడు వారాల గడువు ఇచ్చినట్లయ్యిందంటు తమ్ముళ్ళు తెగ ఫీలైపోతున్నారు. నామినేషన్లు వేసిన తమ అభ్యర్ధులను కాపాడుకోవటం ఎలాగో ఇపుడు ప్రతిపక్షాలకు అర్ధం కావటంలేదు.
ఇప్పటికే రెండు విడతల పంచాయితి ఎన్నికల ఫలితాల్లో వైసీపీ హవా స్పష్టంగా కనబడింది. అదే ఉత్సాహంతో మిగిలిన రెండు విడతల ఎన్నికలను కూడా పూర్తి చేసేస్తారు. తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో రెచ్చిపోతారని టీడీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. అధికారపార్టీతో నిమ్మగడ్డకు ఏదైనా లోపాయికారీ ఒప్పందాలున్నాయా అనే అనుమానాన్ని కూడా తమ్ముళ్ళు వ్యక్తం చేస్తున్నారంటే పాపం నిమ్మగడ్డ పరిస్ధితి ఎలాగైపోయింది.