Begin typing your search above and press return to search.

అరెస్టు చేస్తే.. లీడ‌ర్ అవుతారు

By:  Tupaki Desk   |   11 Aug 2021 2:01 PM GMT
అరెస్టు చేస్తే.. లీడ‌ర్ అవుతారు
X
ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం.. ధ‌ర్నాలు.. నిర‌స‌న‌లు.. ఇలా వివిధ కార‌ణాల‌తో రాజ‌కీయ‌న నేత‌ల‌ను అరెస్టు చేస్తుంటారు. అలా అరెస్ట‌యిన నాయ‌కులు ప్ర‌జ‌ల్లో మ‌రింత ఫేమ‌స్ అవుతారు. ఈ విష‌యాన్ని ఇప్పుడు ఏపీ నేత ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పారు. ఏపీ రాజ‌కీయాల్లో గొప్ప విష‌య ప‌రిజ్ణానం ఉన్న కొందిమంది నాయ‌కుల్లో ఆయ‌న ఒక‌రు. ఏ విషయంపైనైనా అన‌ర్గ‌ళంగా.. చాలా కూలంక‌షంగా ఉన్న‌ది ఉన్న‌ట్లుగా మాట్లాడ‌గ‌ల‌రు. ఇప్పుడు తాజాగా ఏపీ రాజ‌కీయాల‌పై త‌న‌దైన శైలిలో కామెంట్లు చేశారు.

ఏపీలో టీడీపీ నేత‌ల అరెస్టులు స‌రికాద‌ని ఆ నాయ‌కులంతా ప్ర‌జ‌ల‌కు సంబంధించిన గొడ‌వ‌ల విష‌యంలోనే అరెస్ట్ అవుతున్న‌రాని ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ''జ‌గ‌న్ అరెస్ట్ కాక‌పోతే సీఎం అయ్యేవాళ్లు కాదు. ఒక‌ర్ని అరెస్ట్ చేయ‌డ‌మంటే అత‌ణ్ని ఫేమ‌స్ చేసిన‌ట్లే. అరెస్ట్ అయిన వాళ్లంద‌రూ ఎన్నిక‌ల్లో నెగ్గుతారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం చంద్ర‌బాబును అరెస్ట్ చేయిస్తుంద‌ని అనుకోవ‌ట్లేదు. ఈ మాజీ ముఖ్య‌మంత్రిపై పెట్టిన కేసులేవీ నిల‌బ‌డ‌లేవు. ఓటుకు నోటు కేసు ఏదో ఒక‌టి ఉన్న‌ట్లుంది. ఒక మ‌నిషిని అరెస్ట్ చేసి జైళ్లో పెట్ట‌డ‌మంటే హీరోను చేయ‌డ‌మే'' అని ఉండ‌వ‌ల్లి పేర్కొన్నారు. జ‌గ‌న్ పాల‌న‌పై కూడా ఆయ‌న స్పందించారు. 2024 వ‌ర‌కూ జ‌గ‌న్ ఉచిత ప‌త‌కాలు కొన‌సాగిస్తే మ‌ళ్లీ ఆయ‌నే అధికారంలోకి వ‌స్తార‌ని అన్నారు. క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే ప్ర‌జ‌ల ఖాతాల్లో డ‌బ్బులు వేయాల‌ని చాలామంది నిఫుణులు చెప్పార‌ని, ఆ డ‌బ్బు మార్కెట్లోకి వ‌స్తే రొటేష‌న్ జ‌రిగితే జీడీపీ ఉంటుంద‌ని ఉండ‌వ‌ల్లి చెప్పారు.

''న‌వ‌ర‌త్నాల పేరుతో అకౌంట్ల‌లో జ‌గ‌న్ డ‌బ్బులు వేస్తున్నారు. కానీ ఇలాగే ఎన్నాళ్లు కొన‌సాగిస్తారు. ఇప్ప‌టికే ఇబ్బందులు మొద‌ల‌య్యాయి. ఉద్యోగుల‌కు జీతాలు ఆల‌స్య‌మ‌వుతున్నాయి. ఆస్తులు అమ్ముతున్నారు. దేశంలో కూడా ఆర్థిక ప‌రిస్థితి బాలేదు. ఉచిత ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నంత కాలం జ‌గ‌న్‌కు ఎదురుండ‌దు'' అని ఉండ‌వ‌ల్లి తెలిపారు. ఓ రాజ‌కీయ నేత‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మిని స్పోర్టివ్‌గా తీసుకుని ప్ర‌జ‌ల్లోనే ఉన్నాన‌నే సందేశాన్ని ఇస్తూనే ఉన్నార‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ''ప్ర‌స్తుతం సినిమా చేసి డ‌బ్బులు సంపాదించుకుంటాన‌ని ప‌వ‌న్ స్ప‌ష్టంగా చెప్పారు. ఆయ‌న స‌రైన మార్గంలో వెళ్తే మంచిదే. బీజేపీతో క‌లిసినా ప్ర‌జ‌లు ప‌వ‌న్‌ను మాత్ర‌మే చూస్తారు. గ‌త ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత కూడా ప‌వ‌న్ రాజ‌కీయాల్లో కొన‌సాగ‌డం ఓ మంచి ల‌క్ష‌ణం'' అని ఉండ‌వ‌ల్లి వివ‌రించారు. తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం ముఖ్యమైంద‌ని తెలుగు రాష్ట్రాల సీఎంలు కూర్చ‌ని మాట్లాడుకుంటే స‌రిపోయేద‌ని ఆయ‌న చెప్పారు. కేసీఆర్ మాట‌ల్లో స‌మ‌తూకం ఉంటుంది కానీ ఆంధ్రాలో అలా మాట్లేడే వాళ్లు ఎవ‌రూ లేర‌ని రాజ‌కీయం అంటేనే మాట‌లని ఆయ‌న పేర్కొన్నారు.