Begin typing your search above and press return to search.
బాలయ్య డైలాగ్‌ను ఫాలో అవుతున్న టీడీపీ!
By: Tupaki Desk | 20 March 2015 4:46 AM GMTచూడు.. ఒకవైపే చూడు.. రెండో వైపు చూడాలనుకోకు..' అనేది నందమూరి బాలకృష్ణ చెప్పిన సూపర్‌హిట్ సినిమాలోని డైలాగ్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే డైలాగ్ ఫాలో అవుతున్నట్టుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ విజువల్స్ రిలీజ్ చేస్తున్న తీరును గమనిస్తే ఇది అర్థం అవుతుంది.
ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ వారు అసెంబ్లీ సమావేశాల విషయంలో రెండు సార్లు విజువల్స్‌ను విడుదల చేశారు. చీప్ విప్ చేతుల మీదుగా ఈ విజువల్స్ విడుదల అయ్యాయి.
తొలి రోజు విడుదల చేసిన విజువల్స్‌లో వైకాపా నేత రోజా వంటి వారిని లక్ష్యంగా చేసుకోగా.. రెండో రోజు కొడాలి నానిని హైలెట్ చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ వీడియోలు పూర్తిగా వన్‌సైడెడ్‌గా ఉన్నాయి.
అసెంబ్లీలో వైకాపా ఎమ్మెల్యేలు అల్లరి చేస్తున్నారు.. బూతులు మాట్లాడుతున్నారు.. అన్న తమ ఆరోపణకు బలం చేకూర్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఈ విజువల్స్‌ను విడుదలచేస్తోంది. ఈ వ్యూహానికి అయితే వీడియోలు బాగా ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు.
కానీ.. వైకాపా ఎమ్మెల్యేలు ఇలాంటి యాక్షన్‌లో ఉన్నప్పుడు తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యేల రియాక్షన్ ఏమిటి? అనేది క్లారిటీ లేదు. తెలుగుదేశం పార్టీ విడుదల చేస్తున్న వీడియోల్లో వైకాపా ఎమ్మెల్యేలు కనిపిస్తున్నారు కానీ.. తెలుగుదేశం ఎమ్మెల్యేలు కనిపించడం లేదు!
తెలుగుదేశం పార్టీ తన వాదనను ఈ వీడియోల ద్వారా గట్టిగా వినిపించవచ్చు కానీ.. ఈ వాదన వినే వారికెవరికైనా రెండో వైపు ఏం జరుగుతోంది? తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరిస్తున్నారు? అనే సందేహాలు కూడా కలుగుతాయి. అయితే తెలుగుదేశం వాళ్లు వీడియోలను ఎడిట్ చేసి విజువల్స్ చూపిస్తున్నారు. సభలో వీడియోలపై చీప్‌విప్ చేతిలో ఉన్న అధికారాన్ని తెలుగుదేశం వాళ్లు ఇలా ఉపయోగించుకొంటున్నారు.
ఇక రెండోవైపు వీడియోలు అస్సలు వెలుగుచూసే అవకాశమే లేదు. అసెంబ్లీ సమావేశాలను లైవ్‌లో చూపించే చానల్ వాళ్లు ప్రతిపక్షానికి ఆ విజువల్స్ ఇవ్వరు. చీప్ విప్ కూడా అధికార పక్ష ఎమ్మెల్యేల తీరును న్యూస్ ఛానల్స్ ముందుకు తీసుకురారు! దీంతో రెండో వైపు వెలుగుచూసే అవకాశమే ఉండదేమో.