Begin typing your search above and press return to search.
బాబును వదిలేసి బీచులకు వెళ్లిన తమ్ముళ్లు
By: Tupaki Desk | 28 May 2017 6:49 AM GMTమహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఆర్భాటంగా నిర్వహిస్తున్న మహానాడులో తన ప్రసంగ సమయానికి భారీగా తమ్ముళ్లు ఉంటారని భావించిన బాబుకు నిరాశే ఎదురైంది. విశాఖ అందాల ముందు అధినేత ప్రసంగం తేలిపోయిందన్నట్లుగా పరిస్థితి మారింది. దీంతో.. విశాఖ అందాల్ని చూసేందుకు మహానాడు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వెళ్లొచ్చంటూ అధినేతే తమ్ముళ్లకు సూచన చేసే పరిస్థితి.
అలవాటైన ఆర్భాటం.. రోటీన్ ప్రసంగాలు లాంటివి తెలుగు తమ్ముళ్లకు బోర్ కొట్టించినట్లున్నాయి. దీంతో.. వారు మహానాడుకు హాజరయ్యేందుకు పెద్ద ఆసక్తి వ్యక్తం చేయటం లేదన్న మాట వినిపిస్తోంది. శనివారం జరిగిన మహానాడులో మధ్యాహ్నం పన్నెండు గంటలకు మొదలైన పార్టీ అధినేత చంద్రబాబు ప్రసంగం.. సుదీర్ఘంగా గంటన్నర సేపు సాగింది.
బాబు ప్రసంగం స్టార్ట్ చేసిన కాసేపటికే తెలుగు తమ్మళ్లు సర్దుకోవటం కనిపించింది. పెద్ద ఎత్తున తమ్ముళ్లు బయటకు వెళ్లిపోవటంతో.. సభా ప్రాంగణంలోని కుర్చీలు ఖాళీగా కనిపించాయి. తొలిరోజే ఇలాంటి పరిస్థితి ఏర్పడటాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు.. తన ప్రసంగంలో విశాఖ అందాల్ని ప్రస్తావిస్తూ.. నగరాన్ని చూసేందుకు సాయంత్రం తర్వాత వెళ్లొచ్చని.. కావాలంటే మహానాడు ముగిశాక ఒక రోజు ఉండి బొర్రా.. అరకు వెళ్లి రావొచ్చని చెప్పటం కనిపించింది.
తమ్ముళ్లు.. ఇప్పుడే బయటకు వెళ్లకండి.. సాయంత్రం వేళ బీచ్ లకు వెళ్లండి.. ఇక్కడి అందాలు బాగుంటాయంటూ బాబు చెప్పటం గమనార్హం. తొలిరోజే ఇలాంటి పరిస్థితి అంటే.. మిగిలిన రెండు రోజుల మాటేందన్నది ఇప్పుడు బాబు అండ్ కోకు పెద్ద దిగులుగా మారిందని తెలుస్తోంది. మహానాడుకు ఏర్పాటు చేసిన ఏర్పాట్ల ప్రకారం తక్కువలో తక్కువ పదిహేను వేల మంది కూర్చోవటానికి అవకాశం ఉన్నప్పటికీ.. అంత మంది కూడా కనిపించకపోవటం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి విశాఖ బీచ్ అందాల ముందు బాబు తేలిపోయారని చెప్పక తప్పుదని పలువురు తెలుగు తమ్ముళ్లు లోగుట్టుగా మాట్లాడుకోవటం కనిపించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/