Begin typing your search above and press return to search.
గుడివాడలో వైసీపీ వీరంగం.. బాబోయ్ ఇదెక్కడి బరితెగింపు!
By: Tupaki Desk | 26 Dec 2022 5:09 AM GMTఅదేమీ బిహార్ కాదు. గుడివాడ. విద్యకు.. సంపదకు.. తెలివికి తిరుగులేని ప్రాంతంగా చెప్పుకునే ఊరు. ఇంకా చెప్పాలంటే.. దేశంలోని చాలా ఊళ్లలో కనీస వసతులు లేని రోజుల్లోనే.. ఆ ఊరుతో పాటు చుట్టుపక్కల ఉన్న ఊళ్లల్లో వారు ఉన్నత చదవుల కోసం విదేశాలకు వెళ్లిన ఊరు. అలాంటి చోట.. రాజకీయ అధిపత్యం కోసం బరితెగించిన తీరు చూస్తే.. ఇదెక్కడి ఊరురా అనుకోకుండా ఉండలేం. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎంతటి దారుణంగా ఉన్నాయన్న దానికి నిదర్శనంగా గుడివాడ నిలుస్తుంది.
టీడీపీ కార్యాలయం మీదకు దూసుకొచ్చిన మాజీ మంత్రి కమ్ ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు టీడీపీ నేతల మీదా.. కార్యకర్తల మీదా పెట్రోల్ పాకెట్లను విసిరి.. వాటికి నిప్పు అంటించే ప్రయత్నం చేయటం.. ఈ క్రమంలో కర్రలు.. కత్తులతో విరుచుకుపడే ప్రయత్నం చేశారు. లక్కీగా పెట్రోల్ పాకెట్లకు నిప్పు అంటుకోలేదు కాబట్టి సరిపోయింది. ఏ మాత్రం తేడా వచ్చినా పరిస్థితి దారుణంగా ఉండేవి.
గుడివాడలో గడిచిన మూడున్నరేళ్లుగా సాగుతున్న వైసీపీ నేతల అరాచకాలకు.. దౌర్జన్యానికి నిలువెత్తు రూపంగా ఆదివారం దారుణ సంఘటనలు చోటు చేసుకున్నాయి. అసలు ఇంతకీ ఈ వివాదం ఎక్కడ మొదలైంది? ఎందుకు మొదలైంది? ఈ దారుణంలో కీలక భూమిక పోషించిందెవరు? పోలీసులు ఏం చేస్తున్నారు? నిఘా వ్యవస్థ నిద్ర పోయిందా? లాంటి ప్రశ్నలు తలెత్తక మానవు. ఇంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..
ఈ రోజు(సోమవారం) వంగవీటి మోహన రంగా వర్థంతి. దాన్ని ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ నేతలు ఆదివారం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆదివారం సాయంత్రం 6.15 గంటల వేళలో టీడీపీ గుడివాడ నియోజకవర్గ ఇంచార్ఝి రావి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేశారు మాజీ మంత్రి.. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుడైన కాళీ. రంగా వర్థంతిని టీడీపీ నేతలు నిర్వహించకూడదని వార్నింగ్ ఇచ్చారు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రావి వెంకటేశ్వరరావు.. అది చెప్పటానికి నువ్వు ఎవరు? అని గట్టిగా ప్రశ్నించారు రావి. దీంతో మండిపడిన కాళీ.. తీవ్ర స్వరంతో బూతులు తిడుతూ ఎక్కువ మాట్లాడితే నిన్ను లేపేస్తా అంటూ నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం మొదలు పెట్టాడు. తమ నేత రావిని ఉద్దేశించి కాళీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైనాన్ని తెలుసుకున్న టీడీపీకి చెందిన పలువురు పార్టీ ఆఫీసు వద్దకు చేరుకున్నారు.
వారంతా కలిసి కాళీ ఇంటికి నిరసనగా వెళ్లాలని భావించారు. దీంతో పోలీసులు టీడీపీ ఆఫీసు వద్దకు చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. టీడీపీ నేతలు.. కార్యకర్తలు పార్టీ ఆఫీసు వద్దకు చేరుకున్నారు. దీనికి పోటీగా వైసీపీకి చెందిన నేతలు.. కాళీ వర్గీయులు టీడీపీ ఆఫీసు వద్దకు చేరుకున్నారు. టీడీపీ శ్రేణులపై పెట్రోల్ పాకెట్ల విసిరి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. అదే సమయంలో కర్రలు.. కత్తులతో దాడి చేయటం మొదలుపెట్టారు.
వీడియోలు.. ఫోటోలు తీస్తున్న కార్యకర్తల మీదా.. మీడియా వారి మీదా దాడికి పాల్పడ్డారు. కర్రలతో కొట్టారు. ఈ క్రమంలో ఐదుగురు మీడియా ప్రతినిధులకు గాయాలు అయ్యాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు తమదైన శైలిలోరియాక్టు కాలేదన్న విమర్శ వినిపిస్తోంది. టీడీపీ ఆఫీసు వద్దకు వచ్చి.. ఆ పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడుతున్న వైసీపీ వర్గం వారిని చూసి చూడనట్లుగా వ్యవహరించిన పోలీసులు.. అందుకు భిన్నంగా టీడీపీ కార్యకర్తలపై లాఠీ లతో పోలీసులు విరుచుకుపడినట్లుగా చెబుతున్నారు.
మొత్తంగా తీవ్ర ఉద్రిక్తల వేళ.. వైసీపీ నేతల్ని పంపేసిన పోలీసులు.. వారి తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై మాత్రం లాఠీలకు పని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం ఇష్యూ మీద టీడీపీ ఇంఛార్జి రావి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా.. కేసు నమోదు చేయకపోవటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమపై జరిగిన దాడికి ప్రతిగా టీడీపీ శ్రేణులు సన్నద్దమవుతున్నాయి. ఇంత జరిగినా పోలీసులు ఈ ఇస్యూను సరిగా డీల్ చేయలేదన్న విమర్శ వినిపిస్తోంది. అయినా.. రంగా లాంటి నాయకుడి వర్థంతిని వైసీపీ నేతలు మాత్రమే నిర్వహించాలని అనుకోవటం ఏమిటి? ప్రతి విషయంలోనూ తమ అధిపత్యాన్ని ప్రదర్శించాలని.. ప్రతిపక్ష టీడీపీ ఉనికే లేకుండా చేయటానికి తెగపడుతున్న పరిస్థితి ఇప్పుడు షాకింగ్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.