Begin typing your search above and press return to search.
బాబును వాడుకుని వదిలేశారా.... !
By: Tupaki Desk | 10 July 2019 6:54 AM GMTరాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో.. చెప్పడం కష్టం. పార్టీలకు కట్టుబడి రాజకీయాలు చేసే నా యకులు ఇప్పుడు చాలా తక్కువ మందే ఉన్నారు. ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా.. అవకాశం-అవసరం కోసమే అనే విధా నం బాగా ప్రబలిపోయింది. తమకు అవకాశం ఉన్నంత వరకు జై కొట్టిన పార్టీని - తమ అవసరానికి వినియోగించు కున్న నాయకుడిని సదరు అవకాశం- అవసరం తీరిపోయాక పక్కన పెట్టడం నేటి రాజకీయ నేతల లక్షణంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుత రాజకీయాలు నడుస్తున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎదురైన పరిస్థితి కూడా దీనినే నిరూపించింది.
విషయంలోకి వెళ్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ ఎప్పుడు మందీ మార్బలానికి తక్కువ ఉండదు. ఆయన ఎక్కడ కు వెళ్లినా.. ఏం చేస్తున్నా.. ఫాలో అయ్యేవారు చాలా మందే ఉంటారు. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు ఆయనను విజన్ ఉన్న నాయకుడని - ఆయన మహానుభావుడని కొనియాడని వారు లేరు. ఇక, సొంత జిల్లా చిత్తూరు పర్యటనకు వెళ్తే.. రేణిగుంట విమానాశ్రయం నుంచి వందల సంఖ్యలో కార్లలో ఆయనను అనుసరించిన వారే ఎక్కువ. ఇక - చిన్నా చితకా నాయకుల సంఖ్యకు లెక్కేలేదు.
ఇలాంటి చంద్రబాబుకు ఇప్పుడు అదే జిల్లాలో ఘోరమైన అవమానం ఎదురైంది. ముఖ్యంగా ఆయన ఎవరినైతే ఏరికోరి భుజాలకు ఎక్కించుకున్నారో.. వారంతా ఆయన ముఖం చాటేశారు. వైసీపీ నుంచి 2014లో విజయం సాధించిన చాలా మంది నాయకులను చంద్రబాబు తన పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు కూడా ఇచ్చి గౌరవించారు. ఇక, వీరంతా చంద్రబాబుకు పెట్టని భజన బృందంగా మారిపోయారు. అయితే, ఇప్పుడు పార్టీ ఏపీలో ఓటమి పాలైన నేపథ్యంలో పార్టీ సూత్రాలను - సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లి కేడర్ ను బలోపేతం చేసుకోవాల్సిన నాయకులు ఇప్పుడు మొహం చాటేస్తున్నారు.
ముఖ్యంగా అధినేత సొంత జిల్లాకు వచ్చినా.. కూడా ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరించారు. పక్కనే ఉన్న పలమనేరు మాజీ ఎమ్మెల్యే - మంత్రి అమర్ నాథ్ రెడ్డి సహా ఎవరూ కీలక నాయకులు బాబుకు ఆహ్వానం పలకలేదు సరికదా.. వచ్చి ఆయనను కలిసి చర్చించనూ లేదు. సో.. మొత్తానికి ఇలాంటి వారంతా బాబును వాడుకునేందుకు తప్ప పార్టీకి ఏమాత్రం ఉపయోగపడరనే విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది. ఏదేమైనా విజయం లేని వీరుడు ఎవ్వరికి పట్టడు అన్న సామెత బాబు విషయంలో బాగా ఫ్రూవ్ అయ్యింది.