Begin typing your search above and press return to search.

సీఎం రమేశ్‌ పై సొంత పార్టీ నేతలే కంప్లయింట్ చేశారా?

By:  Tupaki Desk   |   13 Oct 2018 8:11 PM GMT
సీఎం రమేశ్‌ పై సొంత పార్టీ నేతలే కంప్లయింట్ చేశారా?
X
తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేశ్ కార్యాలయాలు - నివాసాలు - బంధువుల ఇళ్లపై ఐటీ దాడుల నేపథ్యంలో ఆ పార్టీ కేంద్రంలోని బీజేపీపై ఆరోపణలు చేస్తున్నప్పటికీ ఇప్పుడు కొత్తగా మరో వాదనా వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలోనే సీఎం రమేశ్‌తో పొసగనివారు... ఆయన డామినేషన్‌ను తట్టుకోలేనివారు ఐటీ శాఖకు పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేశారన్న వాదన ఒకటి వినిపిస్తోంది.

ముఖ్యంగా కడప జిల్లాకే చెందిన మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి - సీఎం రమేశ్‌కు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. వరదరాజులరెడ్డికి కాంట్రాక్టులు రాకుండా, బిల్లులు రాకుండా అడ్డుపడుతూ.. ఆయన్ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు సీఎం రమేశ్ అన్నిరకాలుగా ప్రయత్నించారన్నది కడప టీడీపీలో ఒక వర్గం వాదన. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయంటారు. రమేష్ పై వరదరాజులు ఎప్పుడు మాట్లాడినా ఎంపి అక్రమ సంపాదనపైనే ఆరోపణలు చేసేవారు.

మరోవైపు సీఎం రమేశ్‌పై టీడీపీ కీలక నేతల్లోనూ కొందరికి ఆగ్రహం ఉన్నట్లు సమాచారం. డబ్బు పెట్టుబడి పెట్టి చంద్రబాబు వద్ద మంచి పేరు కొట్టేస్తూ కావాల్సిన కాంట్రాక్టులు దక్కించుకుంటుండడంతో మరికొందరు టీడీసీ నేతలు అసూయతో రగిలిపోతున్నారట. ఇలా ఆయన పై లోలోన రగిలిపోయే కొందరు టీడీపీ నేతలు కలిసి ఐటీకి కంప్లయింట్ చేశారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

అయితే... రమేశ్ అక్రమ సంపాదనపై అందరికంటే ముందే వైసీపీ నేత వైఎస్ విజయమ్మ హైకోర్టులో కేసేశారు. 2003లో రూ 61 కోట్లున్న కంపెనీ ఆదాయం 2009కి రూ 488 కోట్లకు చేరుకోవటంపై విజయమ్మ అనుమానాలు వ్యక్తం చేస్తు కోర్టులో కేసు వేశారు. మరి ఏమైందో ఏమో కానీ రమేష్ కంపెనీల పై విచారణకు కోర్టు అంగీకరించలేదు. ఇపుడు ఐటి దాడులతో చాలా విషయాలు వెలుగు చూడనున్నట్లు సమాచారం.