Begin typing your search above and press return to search.
జగన్ నిరూపిస్తే..మంత్రి పదవులు వదిలేస్తాం
By: Tupaki Desk | 9 July 2017 9:49 AM GMTవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీపై - ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అధికార తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. ప్లీనరీ సాక్షిగా తమపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ భయంతో జగన్ కు కాళ్లూ చేతులూ ఆడటం లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్లీనరీ వేదికపై కూర్చున్న వారంతా దోపిడీ దొంగలేనని కేఈ విమర్శించారు. వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో నుంచి బయటపడేయాలని కోరుతూ ప్రధాని మోడీ కాళ్లపై పడ్డారని విమర్శించారు. జగన్ తమపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే కేబినెట్ మంత్రులం మొత్తం రాజీనామా చేస్తామని కేఈ కృష్ణమూర్తి సవాల్ విసిరారు. ఈ విషయంలో జగన్ ముందుకు రావాలని డిమాండ్ చేశారు.
మరో మంత్రి - టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం వైసీపీపై మండిపడ్డారు. ప్లీనరీలో వైసిపి నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, నేర చరిత్రతో జగన్ సీఎం కావాలని తాపత్రయపడుతున్నారని ఆయన విమర్శించారు. సీఎం చంద్రబాబును విమర్శించడానికే వైసిపి ప్లీనరీ పెట్టినట్లుందని మంత్రి సోమిరెడ్డి అన్నారు. అమరావతి నిర్మాణం, ప్రాజెక్టుల విషయం అడ్డంకులు సృష్టిస్తున్నారని, వాటి నిర్మాణాలకు ఎవరడ్డొచ్చినా ఊరుకోబోమని హెచ్చరించారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ అమరావతిని అడ్డుకుంటే ఆహుతైపోతారని శాపనార్థాలు పెట్టారు. అమరావతిని అడ్డుకుంటే రాజకీయ భవిష్యత్ ఉండదని, రాష్ట్ర బడ్జెట్ ను మించి అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడం తగదని ఆయన అన్నారు. వైఎస్ జగన్ తీరును ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు.
కొద్దికాలం క్రితం టీడీపీలో చేరిన సీనియర్ రాజకీయ వేత్త దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయటానికి పులివెందుల రౌడీలు ప్రయత్నిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని అన్నారు. దివంగత వైఎస్ కుటుంబం చేసిన అవినీతి గురించి పుస్తకాలు విడుదల చేస్తే పెద్ద లైబ్రరీ అవుతుందని ఎద్దేవా చేశారు. అవినీతి సామ్రాజ్యనికి రారాజుగా ఉన్న జగన్ జైలుకి వెళ్లి వచ్చినప్పటికీ తన ప్రవర్తన లో మార్పు రాలేదని ఆరోపించారు. ప్రజలను తప్పు దారి పట్టించేందుకు జగన్ శత విధాలుగా ప్రయత్నిస్తున్నాడని అయితే ప్రజలు వాటిని గమనిస్తున్నారని దేవినేని అవినాశ్ అన్నారు.