Begin typing your search above and press return to search.

ఛీ ఛీ బాబుకి ఇంతకంటే ఘోర అవమానం ఉంటుందా?

By:  Tupaki Desk   |   27 Nov 2019 9:53 AM GMT
ఛీ ఛీ బాబుకి ఇంతకంటే ఘోర అవమానం ఉంటుందా?
X
రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చొని ఉన్న యజమానికి కనీసం ఆ ఇంట్లోని కుక్క కూడా రెస్పెక్ట్ ఇవ్వదు అన్నట్టు తయారైపోయింది ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి. చంద్రబాబు సాధారణంగా మాట్లాడుతున్న సమయంలో మా పార్టీ పద్దతికి మారు పేరు అని - టీడీపీ పార్టీ నేతలు కానీ - కార్యకర్తలు కానీ - డిసిప్లేన్ పాటిస్తారని చాలా సందర్భాలలో గొప్పగా చెప్తారు. కానీ - లోపల మాత్రం ఆలా జరగదు అని తాజాగా మరోసారి రుజువైంది. తెలుగు తమ్ముళ్లు ఏకంగా ..అధినేత ముందే తన్నుకున్నారు. దీనితో బాబు ఏమిచేయలేక ..చోద్యం చూస్తున్నట్టు కూర్చుండి పోయారు. ఈ ఘటన కడప జిల్లాలో జరగడం మరో విశేషం. ఈ ఘటనతో పార్టీలో ఉన్న విబేధాలు మరోసారి బయటపడ్డాయి.

ఇకపోతే తాజాగా 2019 ఏప్రిల్ లో ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. దీనితో పార్టీని తిరిగి బలోపేతం చేయడానికి బాబు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కడప జిల్లా లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా .. స్థానిక శ్రీనివాస కళ్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గాల సమీక్షా సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు.

ఈ నియోజకవర్గాల సమీక్షా సమావేశంలో 15వ డివిజన్ ఇన్‌ చార్జ్ టీడీపీ దళిత కార్యకర్త కొండా సుబ్బయ్య మాట్లాడుతూ..టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేసారు. దీనితో అక్కడ గొడవ మొదలైంది. తనపై తీవ్రమైన ఆరోణలు చేస్తుండటం తో కోపం తో ఊగిపోయిన శ్రీనివాసరెడ్డి - వెంటనే సుబ్బయ్య చేతిలోని మైకును లాక్కొని.. అధినేత అక్కడే ఉన్నాడనే కనీస మర్యాద లేకుండా ... కార్యకర్త పై దాడి చేసారు. సమావేశంలో ఇంత వ్యవహారం జరుగుతున్న బాబు వారిని నిలువరించకుండా చోద్యం చూస్తున్నట్టు ఉండిపోవడం గమనార్హం. ఈ విషయం బయటకి రావడం తో బాబు ఇదేనా తెలుగు తమ్ముళ్ల డిసిప్లేన్ అంటూ బాబు పై సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఈ సంఘటనపై రిమ్స్‌ పోలీస్‌ స్టేషన్‌ లో సుబ్బయ్య ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి - 8 మంది అతని అనుచరులపై ఎస్సీ - ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.