Begin typing your search above and press return to search.

'గ‌వ‌ర్న‌ర్‌' కేంద్రంగా ఏపీ, తెలంగాణ అసెంబ్లీల్లో ర‌సాభాస‌

By:  Tupaki Desk   |   7 March 2022 8:27 AM GMT
గ‌వ‌ర్న‌ర్‌ కేంద్రంగా ఏపీ, తెలంగాణ అసెంబ్లీల్లో ర‌సాభాస‌
X
`గ‌వ‌ర్న‌ర్‌` అంశం కేంద్రంగా ఇటు ఏపీలోను.. అటు తెలంగాణ‌లోనూ తీవ్ర ర‌భ‌స చోటు చేసుకుంది. ఎమ్మె ల్యేలను పూర్తిగా బ‌డ్జెట్ సెష‌న్ వ‌ర‌కు తెలంగాణ స‌భ‌లో స‌స్పెండ్ చేస్తే.. ఏపీలో ప్ర‌తిప‌క్ష స‌భ్యులు స్వ‌చ్ఛం దంగా త‌ర‌లిపోయారు. ఈ చిత్ర‌మైన అంశాలు ఏంటంటే.. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ఈ రోజు ప్రారంభ‌మ‌య్యాయి.

ఈ క్ర‌మంలో ఏపీలో గ‌వ‌ర్న‌ర్ తొలిసారి.. స‌భ‌కు వ‌చ్చి.. త‌న ప్ర‌సంగంతో స‌భ‌ల‌ను ప్రారంభించే చ‌ర్య‌లుచేప‌ట్టారు. ఈ క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ స‌భ‌కు వ‌చ్చీరాగానే.. విప‌క్షం టీడీపీ స‌భ్యులు .. ఒక్క ఉదుట‌న ఆందోళ‌న ప్రారంభించారు.

`రాష్ట్రంలో పాల‌న‌ను స‌వ్యంగా చేయ‌లేని ప్ర‌భుత్వాన్ని కంట్రోల్ చేయ‌డం చేత‌కాని గ‌వ‌ర్న‌ర్ గోబ్యాక్` అం టూ టీడీపీ స‌భ్యులు ఆందోళ‌న‌కు దిగారు. రాష్ట్రంలో వ్య‌వ‌స్థ‌లు నిర్వీర్యం అవుతున్నాయ‌ని.. పేర్కొన్నారు. దీనికి గ‌వ‌ర్న‌ర్ స‌మాధానం చెప్ప‌కుండా.. స‌భ‌లోకి అడుగు పెట్ట‌నివ్వ‌బోమ‌న్నారు.

టీడీపీ స‌భ్యుల ఆందోళ‌న మ‌ధ్యే గ‌వ‌ర్న‌ర్ త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు. అయితే.. టీడీపీ స‌భ్యులు మ‌రింత రెచ్చిపోయి.. గ‌వ‌ర్న‌ర్ బ‌డ్జెట్ ప్రసంగానికి సంబంధించిన ప్ర‌తుల‌ను చించేసి.. వాకౌట్ చేశారు.

ఇక‌, తెలంగాణలోనూ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభమ‌య్యాయి. ఇక్క‌డ కూడా గ‌వ‌ర్న‌ర్ కేంద్రంగా విప‌క్షం బీజేపీ విరుచుకుప‌డింది. ఇక్క‌డ ఏం జ‌రిగిందంటే.. స‌భ‌ను సాధార‌ణంగా.. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంతో ప్రారం భించాల్సి ఉండ‌గా.. ఈ ద‌ఫా.. గ‌వ‌ర్న‌ర్‌ను కేసీఆర్ ప్ర‌భుత్వం ఆహ్వానించ‌లేదు.

ఎందుకంటే.. గ‌త అసెం బ్లీ స‌మావేశాల‌ను ప్రోరోగ్ చేయ‌లేదు కాబ‌ట్టి.. తాము గ‌వ‌ర్న‌ర్‌ను పిల‌వాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ప్ర‌భుత్వం పేర్కొంది. అయితే.. బీజేపీ నేత‌లు మాత్రం దీనిని త‌ప్పుబ‌ట్టారు.

గ‌వ‌ర్న‌ర్ల వ్య‌వ‌స్థ‌ను కేసీఆర్ కించ‌ప‌ప‌రుస్తున్నార‌ని.. అందుకే గ‌వ‌ర్న‌ర్‌ను బ‌డ్జెట్ స‌మావేశాల ప్ర‌సంగాల‌కు ఆహ్వానించ‌లేద‌ని.. బీజేపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఈ నేప‌థ్య‌లో ప్రారంభమైన స‌మావేశాల్లో బీజేపీ స‌భ్యులు.. తీవ్ర ఆందోళ‌న‌కు దిగారు. గ‌వ‌ర్న‌ర్‌ను ఆహ్వానించ‌క‌పోవ‌డం దారుణ‌మ‌ని పేర్కొంటూ.. బ‌డ్జెట్ ప్ర‌తుల‌ను చింపేశారు.

దీంతో వ‌వీరిని స‌భ నుంచి బ‌ల‌వంతంగా ఈ బడ్జెట్ సెష‌న్ వ‌ర‌కు స‌స్పెండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే.. అటు ఏపీలో గ‌వ‌ర్న‌ర్ వ‌చ్చినందుకు.. ఇటు తెలంగాణ‌లో రానందుకు.. స‌భ‌లు హోరెత్తిపోవ‌డం గ‌మ‌నార్హం.