Begin typing your search above and press return to search.

తమ్ముళ్లను తీసుకున్నావ్ సరే గ్రామాలు కూడానా?

By:  Tupaki Desk   |   17 Feb 2016 5:30 PM GMT
తమ్ముళ్లను తీసుకున్నావ్ సరే గ్రామాలు కూడానా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీడీపీ తమ్ముళ్లు గుస్సా అవుతున్నారు. తన ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ.. తమ బాబును బద్నాం చేస్తున్నారంటూ తెలంగాణ సీఎంపై వారు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణక సంబంధించిన పరిణామాల మీద తాము అస్సలు స్పందించకున్న.. తమ విషయాల్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహా.. పలువురు నేతలు రియాక్ట్ అవుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని వారు మండిపడుతున్నారు.

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేల్ని ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా పార్టీలోకి లాగేసుకోవటం తెలిసిందే. ఇప్పటికే పదిమంది టీటీడీపీ ఎమ్మెల్యేలు కారు ఎక్కేసిన సంగతి తెలిసిందే. ఓపక్క ఎమ్మెల్యేలు జారిపోయారన్న ఆగ్రహంతో ఏపీ సీఎం చంద్రబాబు ఉంటే.. ఆ విషయాన్న వదిలేసి.. కేంద్రం కలిపేసి కొన్ని మండలాల్ని తెలంగాణకు తిరిగి ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని.. ఆయన ఒప్పుకున్నట్లుగా తన ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా పేర్కొన్నారు. ఇందులో నిజం ఎంత? అబద్ధం ఎంతన్న విషయాల్ని పక్కన పెడితే.. ఏపీ తమ్ముళ్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఓ పక్క తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్ని లాగేసుకుంటూ పార్టీ ఉనికే లేకుండా చేస్తున్న కేసీఆర్.. ఇప్పుడు ఏపీకి చెందిన మండలాల్ని కూడా తెలంగాణకు బాబు ఇచ్చేస్తున్నట్లుగా పేర్కొనటం సరికాదని చెబుతున్నారు. ఎమ్మెల్యేల్ని తీసుకెళ్లటం సరిపోలేదన్నట్లుగా.. ఇప్పుడు ఏకంగా ఏపీకి చెందిన ప్రాంతాల్ని కూడా తెలంగాణకు తీసుకెళ్లటం చూస్తుంటే.. ఏపీ మొత్తాన్ని కేసీఆర్ కు ఇచ్చేసి బాబు ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవాలా? అంటూ ఒక టీడీపీ సీనియర్ నేత మండిపడటం గమనార్హం.