Begin typing your search above and press return to search.

పచ్చబ్యాచ్ అంతే.. తాటాకులు కట్టేయడమే!!

By:  Tupaki Desk   |   15 March 2018 2:50 AM GMT
పచ్చబ్యాచ్ అంతే.. తాటాకులు కట్టేయడమే!!
X
చంద్రబాబు దళం మొత్తం ఒకటే తీరుగా వ్యవహరిస్తారు. అందరిదీ అధినేత చూపించిన మార్గమే. తమకు అనుకూలంగా ఉన్నంత వరకూ వ్యక్తులను నెత్తిన పెట్టుకోవడం.. తమకు ప్రతికూలంగా ఒక్క మాట మాట్లాడినా సరే.. వారికి ఎలా తాటాకులు కట్టేయాలా? వారికి ఉన్న క్రెడిబిలిటీని ఎలా దెబ్బతీయాలా? తమ శత్రువులతో వారికి ఎలా ముడిపెట్టి, ఆ మాటలకు విలువలేకుండా చేయాలా? అని కుట్రలు పన్నడం.. ఇదే వారి శైలి.

ఇప్పుడు చంద్రబాబునాయుడు తన పార్టనర్ పవన్ కల్యాణ్ విషయంలో కూడా అదే సిద్ధాంతం అవలంబిస్తున్నారు. తన పార్టీ మీద, తన పరిపాలనలోని అవినీతి మీద, రాష్ట్రం హక్కులను సాధించడంలో తన లోపాయికారీతనం మీద.. మొత్తంగా తన అసమర్థత మీద.. అన్నిటినీ మించిన తన కొడుకు అవినీతి మీద పవన్ కల్యాణ్ నిశిత విమర్శలు సంధించే సరికి.. చంద్రబాబునాయుడు మరియు ఆయన పచ్చ కోటరీ తట్టుకోలేకపోతున్నట్టుగా ఉంది. అందుకే పవన్ కల్యాణ్ మాటలకు విలువ లేకుండా చేయడం ఎలాగా అని వారు మధనపడిపోతున్నారు.

తొలి కౌంటర్ గా పవన్ కల్యాణ్ సాక్షి దినపత్రిక చదివి మాట్లాడుతున్నాడంటూ.. ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ కౌంటర్ ఇవ్వడం విశేషం. పవన్ చేసిన ఆరోపణలు నిజమా కాదా? దమ్ముంటే చెప్పాలి గానీ.. పవన్ ఏ పత్రిక చదువుతున్నాడు.. ఏది చదవాలి.. ఏది చదవకూడదు.. అనే విషయాల్ని కూడా మీరే డిసైడ్ చేస్తారా? అని ప్రజలు విస్తుపోతున్నారు.

మీకు చేతనైతే పవన్ ఆరోపణలు అబద్ధం అని చెప్పండి.. మీ నిజాయితీని నిరూపించుకోండి.. అంతే తప్ప.. పవన్ కు ముడిపెట్టడం ఎందుకు? అనే మాటలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. అయితే బాబూ రాజేంద్రప్రసాద్ మాత్రం.. పవన్ వి సొంత మాటలు కానద, ఆయన చుట్టూ ఉన్న వాళ్లు అలా మాట్లాడిస్తున్నారని, తప్పుదారిపట్టిస్తున్నారని కొత్త భాష్యం చెప్పడం విశేషం. పవన్ తన మీద ఉన్న తెలుగుదేశం తోక ముద్రను చెరిపేసుకోవడానికి ఇలా సాక్షిలోని నిరాధార ఆరోపణల్ని చేసి ఉండవచ్చునని కూడా రాజేంద్రప్రసాద్ అంటున్నారు.

ఇంకా నయ్యం.. పవన్ స్పీచ్ సాక్షి ఆఫీసులో తయారైందనలేదు అంటూ జనం నవ్వుకుంటున్నారు...........