Begin typing your search above and press return to search.
బాబు ఆందోళన.. డ్యామేజ్ కంట్రోల్ కు టీడీపీ నేతల యత్నం!
By: Tupaki Desk | 15 April 2019 1:30 AM GMTఈవీఎంల పనితీరుపై ఆందోళన వ్యక్తం చేయడం.. జరిగినవి ఎన్నికలే కాదు అని అనడం.. ఎన్నికల ప్రక్రియ విషయంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉండటం.. ఇదీ పోలింగ్ సమయం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు చేస్తున్న పని. వరసగా ఒకే తరహా వ్యాఖ్యలతో చంద్రబాబు నాయుడు వార్తల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై రకరకాల కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి.
చంద్రబాబు నాయుడుకు ఎలాగూ తన పార్టీ ఎన్నికల్లో ఓడిపోతుందని అర్థమైందని అందుకే ఇలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారని కొందరు అంటున్నారు. ఓటమికా సాకులు చూపడానికి ఇప్పటి నుంచి ఈవీఎంల మీద చంద్రబాబు నాయుడు నెపాన్ని నెడుతున్నారనే కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి.
ఈ మాటలు సహజంగానే తెలుగుదేశం పార్టీ వారిలోనూ కాస్త ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. తమ గెలుపు గ్యారెంటీ అనే ధీమాతో ఉన్న వారు కూడా .. బాబు కామెంట్లను చూసి. నిజంగానే తేడా కొట్టేసిందా.. అనే సందేహాల్లో మునుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బాబు కామెంట్లు చాలా డ్యామేజ్ నే చేస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అందుకే ఇప్పుడు తెలుగుదేశం వాళ్లు డ్యామేజీ కంట్రోల్ కు దిగారు. చంద్రబాబు నాయుడు ఈవీఎంల పనితీరు మీద ఆందోళన వ్యక్తం చేసినంత మాత్రానా..ఈసీని తప్పుపట్టినంత మాత్రానా.. జరిగినవి ఎన్నికలే కాదు అన్నంత మాత్రానా.. తెలుగుదేశం పార్టీ ఓడిపోయినట్టుగా కాదు..అని తెలుగుదేశం నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
చంద్రబాబు నాయుడు అలర్ట్ చేస్తూ ఉన్నారని, జాతీయ స్థాయిలో మరో చోట ఏపీలాంటి పరిస్థితి తలెత్తకుండా తదుపరి దశల పోలింగ్ రోజున ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండేందుకే బాబు ఇలా మాట్లాడుతూ ఉన్నారని తెలుగుదేశం నేతలు అంటున్నారు. బాబు వ్యాఖ్యలతో జరుగుతున్న డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకోవడానికి టీడీపీ నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారని స్పష్టం అవుతోంది!